ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్‌లో భారతీయ సంతతి వ్యక్తికి 10 వారాల జైలు శిక్ష..!

ABN, First Publish Date - 2022-06-18T02:25:59+05:30

క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డ ఓ భారత సంతతి వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం తాజాగా 10 వారాల జైలు శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డ ఓ భారత సంతతి వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం తాజాగా 10 వారాల జైలు శిక్ష విధించింది. గత ఏడాది జరిగిన దాడికి సంబంధించిన కేసులో.. కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. తాను తప్పు ఒప్పుకుంటున్నట్టు నిందితుడు తిమొతీ తిరన్‌రాజ్ శివరాజ్ కోర్టుకు తెలపడంతో న్యాయమూర్తి ఈ మేరకు శిక్ష ఖరారు చేశారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. తగ బుకింగ్ క్యాన్సిల్ చేశాడన్న కారణంగా తిమొతీ గతేడాది ఓ క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడ్డాడు. 


ఆ తరువాత వారిద్దరి ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో తిమొతీ క్యాబ్ డ్రైవర్‌పై దాడికి దిగాడు. దీంతో..బాధితుడి వెన్నుముక చివరన ఉండే టెయిల్ బోన్ విరిగింది. అతడి ముఖంపైనా గాయాలయ్యాయి. అయితే.. బాధితుడిని గాయపరచాలనే ఉద్దేశ్యంతోనే దాడికి పాల్పడినట్టు తిమొతీ కోర్టులో అంగీకరించాడు. గతంలో తిమొతీ ఓ మహిళపై దాడి చేసిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితుడికి ఈ శిక్ష విధించింది.  



Updated Date - 2022-06-18T02:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising