ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Americaలో దారుణం.. భారత సంతతి వైద్యుడి కారు కొట్టేసిన దొంగలు.. అదే కారుతో ఢీకొట్టి..!

ABN, First Publish Date - 2022-03-12T17:31:51+05:30

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. ఇద్దరు దొంగలు భారత సంతతి వైద్యుడి కారును కొట్టేసి, అదే కారుతో అతడిని ఢీకొట్టి చంపేశారు. వాషింగ్టన్ డీసీలో మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఈ దారుణ ఘటన జరిగింది. మృతుడిని 33 ఏళ్ల రాకేష్ పటేల్‌గా డీసీ మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. మేరీల్యాండ్‌లోని సిల్వర్ స్ప్రింగ్‌లో ఐసీయూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. ఇద్దరు దొంగలు భారత సంతతి వైద్యుడి కారును కొట్టేసి, అదే కారుతో అతడిని ఢీకొట్టి చంపేశారు. వాషింగ్టన్ డీసీలో మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఈ దారుణ ఘటన జరిగింది. మృతుడిని 33 ఏళ్ల రాకేష్ పటేల్‌గా డీసీ మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. మేరీల్యాండ్‌లోని సిల్వర్ స్ప్రింగ్‌లో ఐసీయూ వైద్యుడిగా రాకేష్ పనిచేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి వాషింగ్టన్ డీసీలోని ఆడమ్స్ మోర్గాన్ పరిధిలోని వెర్నాన్ స్ట్రీట్‌కు రాకేష్ తన ప్రియురాలిని కలిసేందుకు మెర్సిడెస్ కారులో వెళ్లాడు. ఆ సమయంలో గర్ల్‌ఫ్రెండ్ కోసం ఓ గిఫ్ట్ తీసుకెళ్లాడు. ఆ గిఫ్ట్ ప్యాక్‌ను ఇచ్చేసి వెంటనే తిరిగి వచ్చేయాలని కారును అలాగే రన్నింగ్‌లోనే పెట్టి వెళ్లాడు. 


అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఇద్దరు దుండగులు అదే అదునుగా భావించి రన్నింగ్‌లో ఉన్న ఆ కారును వేసుకుని వెళ్లిపోయారు. అది గమనించిన రాకేష్ వారిని వెంబడిస్తూ.. ఎలాగోలా కారు ముందు వెళ్లి ఆగాడు. కానీ, దొంగలు ఎదురుగా నిలబడిన రాకేష్‌ను ఢీకొట్టి పారిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు హూటాహూటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనను ఛాలెంజింగ్‌గా తీసుకున్న డీసీ మెట్రోపాలిటన్ పోలీసులు కారు ఎత్తుకెళ్లిన దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దొంగిలించబడిన రాకేష్ కారు గురువారం దొరికింది. కానీ, ఆ ఇద్దరు దొంగలు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ క్రమంలో వారి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు 25వేల డాలర్ల(రూ.19.18లక్షలు) రివార్డు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Updated Date - 2022-03-12T17:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising