ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: ఎన్నికల్లో వరుసగా రెండోసారి సత్తా చాటిన భారత మహిళ

ABN, First Publish Date - 2022-08-03T21:57:29+05:30

భారత్‌కు చెందిన మహిళ అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి సత్తా చాటారు. చార్లొట్టె(Charlotte) సిటీ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ డింపుల్ అజ్మీరా(Dimple Ajmera) విజయం సాధించారు. చార్లెట్టె(Charlotte) కౌన్సిలర్‌గా వరుసగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన మహిళ అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి సత్తా చాటారు. చార్లొట్టె(Charlotte) సిటీ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ డింపుల్ అజ్మీరా(Dimple Ajmera) విజయం సాధించారు. చార్లెట్టె(Charlotte) కౌన్సిలర్‌గా వరుసగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో అజ్మీర్‌పై డెమొక్రాట్ బ్రాక్స్‌టన్ విన్‌స్టన్‌ పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన అజ్మీర్.. సంతోషం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 2017లో తొలిసారిగా అజ్మీరా.. Charlotte City Council ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె.. సిటీ కౌన్సిల్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికైన మొదటి ఆసియన్ అమెరికన్, అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. 



గుజరాత్‌లో పుట్టి పెరిగిన అజ్మీరా.. తన తల్లిదండ్రులతో కలిసి 16ఏళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లారు. సౌతర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో (University of Southern California) గ్రాడ్యూయేషన్ పొంది.. లాస్ ఏంజెల్స్‌లో సీపీఏ‌గా పని చేశారు. ఇదిలా ఉంటే.. చార్లొట్టె సిటీ కౌన్సిల్‌కు గత ఏడాది నవంబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. యూఎస్ సెన్సన్ నుంచి జనాభా లెక్కలకు సంబంధించిన సమాచారం ఆలస్యంగా అందడంతో ఎన్నికలను 2022‌కు వాయిదా వేశారు. 


Updated Date - 2022-08-03T21:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising