ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ఫహాహీల్ రోడ్‌లో నగ్నంగా తిరుగుతున్న భారత ప్రవాసుడు అరెస్ట్..!

ABN, First Publish Date - 2022-06-30T14:17:34+05:30

కువైత్‌లోని ఫహాహీల్ రోడ్‌లో నగ్నంగా తిరుగుతున్న ఓ భారత ప్రవాసుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లోని ఫహాహీల్ రోడ్‌లో నగ్నంగా తిరుగుతున్న ఓ భారత ప్రవాసుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్గత మంత్రిత్వశాఖకు ఓ వ్యక్తి హైవేపై బట్టలు విప్పేసి తిరుగుతున్నట్లు సమాచారం అందింది. దాంతో అధికారులు వెంటనే ఆ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు సమాచారం అందించారు. అధికారుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అహ్మదీ ప్రాంతంలో భారత ప్రవాసీయుడిని అరెస్ట్ చేశారు. అయితే, పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఆ వ్యక్తి ఒంటిపై నూలుపోగు లేకుండా రోడ్డుపై తిరుగుతున్నాడు. ఆ సమయంలో అతడు అసాధారణ స్థితిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న తర్వాత మెడికల్ టెస్ట్ కోసం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి మాదక ద్రవ్యాలు సేవించి ఉండొచ్చనే అనుమానంతో డ్రగ్ టెస్టు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అతడిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు ఫహాహీల్ పోలీసులు వెల్లడించారు. అయితే, ఆ వ్యక్తి వివరాలను వెల్లడించలేదు. సాధారణ స్థితికి వస్తే గానీ, అతడు ఎవరు? ఎప్పుడు కువైత్ వచ్చాడు? ఎక్కడ పని చేశాడు? అనే వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-30T14:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising