ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్‌లో భారతీయుడికి 41నెలల జైలు శిక్ష.. భారీ మొత్తంలో జరిమానా.. ఇంతకూ అతడు చేసిన నేరం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-04-21T01:18:54+05:30

సింగపూర్ కోర్టు భారతీయుడికి జైలు శిక్ష విధించింది. పెద్ద మొత్తంలో జరిమానా కూడా విధించింది. సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్‌పవర్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: సింగపూర్ కోర్టు భారతీయుడికి జైలు శిక్ష విధించింది. పెద్ద మొత్తంలో జరిమానా కూడా విధించింది.  సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్‌పవర్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


భారత్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సింగపూర్ గత కొంత కాలంగా జైహో క్లబ్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ క్లబ్‌పై 2016మే 30న స్థానిక పోలీసు అధికారులు దాడులు జరిపారు. ఈ క్రమంలోనే క్లబ్‌లో ముగ్గురు మహిళలను గుర్తించిన అధికారులు విచారణ జరిపారు. దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఉద్యోగం పేరుతో ముగ్గురు మహిళలను బాలసుబ్రహ్మణ్యం ఆరు నెలల ఒప్పందంపై ఇండియా నుంచి తీసుకొచ్చినట్టు గుర్తించారు. 





అంతేకాకుండా అతడు వారికి డబ్బులు చెల్లించకపోవడంతోపాటు ఆ మహిళలపై దాడులకు పాల్పడ్డట్లు కనుగొన్నారు. మహిళల పాస్‌పోర్టులను బాలసుబ్రహ్మణ్యం స్వాధీనం చేసుకుని వారిని ఇబ్బందులకు గురిచేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు మానవ అక్రమ రవాణతోపాటు పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. బాలసుబ్రహ్మణ్యానికి 41నెలల జైలు శిక్ష విధించడంతోపాటు 27,365 సింగపూర్ డాలర్ల జరిమాన విధించింది. 


Updated Date - 2022-04-21T01:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising