ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Azadi ka Amrith Mahotsav: చికాగోలో ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-17T00:53:04+05:30

ఇండియన్ కమ్యూనిటీ ఔట్ రీచ్ (ICO) ఆధ్వర్యంలో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రవాసీ భారతీయులు, ప్రముఖ తెలుగు సంఘాలు తానా, చికాగో ఆంధ్ర అస్సోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇండియన్ కమ్యూనిటీ ఔట్ రీచ్ (ICO) ఆధ్వర్యంలో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో(Independence day celebrations) ప్రవాసీ భారతీయులు, ప్రముఖ తెలుగు సంఘాలైన తానా, చికాగో ఆంధ్ర అస్సోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఇండియా పరేడ్‌లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఇండియన్ కమ్యూనిటీకి మద్దతుగా ఇల్లినాయిస్ రాష్ట్ర పొలిటికల్ పార్టీలు అండగా నిలవగా, చికాగో ఇండియన్ కాన్సులెట్ జనరల్ అమిత్ కుమార్, ఐసిఓ సీఈఓ కృష్ణ బన్సాల్ ప్రసంగించారు. బాలీవుడ్ సింగర్ గురు రంధావా లైవ్ కాన్సర్ట్.. భారీగా హాజరైన శ్రోతలలో ఉత్సాహం నింపింది. చికాగో తానా నాయకుడు హేమ కానూరు, మిడ్ వెస్ట్ రీజినల్ ప్రెసిడెంట్ హను చెరుకూరి, తానా ప్రతినిధులు రవి కాకర, కృష్ణ మోహన్, చిరంజీవి గళ్ళ తదితరులు ఇండియా డే పరేడ్‌లో పాల్గొంటూ, తెలుగు వారి ఖ్యాతిని, స్వాతంత్ర్యం సాధించటంలో తెలుగు నాయకుల కృషిని గుర్తు చేసుకుంటూ, కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. కాంగ్రెస్ మ్యాన్ బిల్ ఫోస్టర్ తెలుగు వాళ్ళ భాగస్వామ్యాన్ని ప్రదర్శించిన తానా లీడర్షిప్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  









Updated Date - 2022-08-17T00:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising