ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sri Lanka Crisis: భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన

ABN, First Publish Date - 2022-07-20T23:55:14+05:30

ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే కొలంబో సమీపంలో గత రాత్రి అనూహ్య దాడి జరిగింది. ఈ దాడిలో భారత ప్రభుత్వాధికారి గాయపడ్డారు. ఈ విషయాన్ని శ్రీలంలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే కొలంబో సమీపంలో గత రాత్రి అనూహ్య దాడి జరిగింది. ఈ దాడిలో భారత ప్రభుత్వాధికారి గాయపడ్డారు. ఈ విషయాన్ని శ్రీలంలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా భారతీయులకు పలు సూచనలు చేసింది. దాడిలో గాయపడిన ఇండియన్ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మను పరామర్శించినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్న ఇండియన్ ఎంబసీ.. గత రాత్రి కొలంబో సమీపంలో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించింది. ఈ ఘటన గురించి శ్రీలంక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పింది. లంకలో తాజా పరిణామాల పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాకపోకలు సాగించాలని అక్కడి భారత పౌరులకు సూచించింది.



ఇదిలా ఉంటే.. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) ఎన్నికయ్యారు. ఆయనపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమయినప్పటికీ దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఎన్నుకున్నారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 225 సీట్లకుగానూ 223 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు గైర్హాజరవ్వగా.. 4 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో చెల్లుబాటు అయిన 219 ఓట్లలో రణిల్ విక్రమసింఘేకి మెజారిటీ దక్కింది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగుమమైంది. గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయాక తాత్కాలిక ప్రెసిడెంట్‌గా  విక్రమసింఘే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2022-07-20T23:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising