ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Embassy of India: ఉక్రెయిన్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ తాజా సూచనలు ఇవే!

ABN, First Publish Date - 2022-10-26T17:33:31+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు చేసింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ నివసించే భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఒకవేళ ఉక్రెయిన్‌లోనే ఉండాల్సిన పరిస్థితులు ఉంటే.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వెల్లడించింది. అంతేకాకుండా ఏదైనా సాయం కావాలంటే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. వారం రోజుల వ్యవధిలో భారత రాయబార కార్యాలయం ఇటువంటి ప్రకటన చేయడం ఇది రెండోసారి. తొలుత అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఉక్రెయిన్‌లోని భారతీయులను ఉద్దేశించి సూచనలు జారీ చేసింది.

Updated Date - 2022-10-26T17:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising