ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Passport Seva: దుబాయ్‌లోని Indian Consulate కీలక ప్రకటన

ABN, First Publish Date - 2022-05-21T18:17:47+05:30

దుబాయ్‌లోని Indian Consulate పాస్‌పోర్ట్ సర్వీసుల విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: దుబాయ్‌లోని Indian Consulate పాస్‌పోర్ట్ సర్వీసుల విషయమై తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22, 29 తేదీల్లో వరుసగా రెండు ఆదివారాలు వాక్-ఇన్ పాస్‌పార్ట్ సేవా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటిచింది. దుబాయ్, షార్జాలోని 4 బీఎస్ఎల్ ఇంటర్నేషనల్ సర్వీస్ కేంద్రాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. భారత ప్రవాసులకు ఎవరికైతే ఎమర్జెన్సీ పాస్‌పోర్ట్, దాని సంబంధిత సర్వీసులు అవసరమో అలాంటి వారి కోసమే ఈ ప్రత్యేక Passport Seva కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. అర్జెంట్, ఎమర్జెన్సీ ఉన్నవారు దీని ద్వారా లబ్ధి పొందవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తులకు అవసరమైన ధృవపత్రాలు జతచేసి ప్రవాసులు నాలుగు కేంద్రాలలో సమర్పించవచ్చని తెలిపారు. first-come, first-serve ప్రాతిపదికన ప్రవాసులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కాన్సులేట్ ట్వీట్ చేసింది. 


పత్రాలు, రుజువులతో కూడిన అత్యవసర కేసుల్లో మాత్రమే ఈ సేవలు అందిచడం జరుగుతుందని తెలిపారు. వీటిలో వైద్య చికిత్స, చనిపోవడం, పాస్‌పోర్టుల గడువు ముగియడం(జూన్ 30నాటికి), అత్యవసర పాస్‌పోర్టుల రెన్యువల్, వీసాలపై రీ-స్టాంప్, గడువు ముగిసిన లేదా రద్దు చేయబడిన వీసాలతో పాటు ఉద్యోగం కోసం కొత్త వీసా పొందడం ఉంటాయని కాన్సులేట్ తన ట్వీట్ పేర్కొంది. అలాగే ఎన్నారై సర్టిఫికేట్స్(విద్యాపరమైన ప్రయోజనాల కోసం), పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లు(ఉద్యోగం లేదా ఇమ్మిగ్రేషన్ ప్రయోజానాల నిమిత్తం), స్వదేశంలో ఎంట్రీ లేదా విదేశాల్లో స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవలు ఎంతో ఉపయోగకరమని కాన్సులేట్ అధికారులు తెలిపారు. 



Updated Date - 2022-05-21T18:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising