ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో భారతీయ వృద్ధుడిపై దాడి.. ఖండించిన ఇండియన్ కాన్సులేట్!

ABN, First Publish Date - 2022-04-06T01:04:46+05:30

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సిక్కు మతస్థుడు నిర్మల్ సింగ్‌పై జరిగిన జాత్యాహంకార దాడిని అక్కడి భారతీయ కాన్సులేట్ సోమవారం ఖండించింది. ఇది చాలా ఆందోళనకరమని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నామంటూ ట్వీట్ చేసింది. ఆదివారం ఉదయం నగరంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సిక్కు మతస్థుడు నిర్మల్ సింగ్‌పై జరిగిన జాత్యాహంకార దాడిని అక్కడి భారతీయ కాన్సులేట్ సోమవారం ఖండించింది. ఇది చాలా ఆందోళనకరమని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నామంటూ ట్వీట్ చేసింది. ఆదివారం ఉదయం నగరంలోని రిచ్‌మండ్ హిల్స్‌లో వాకింగ్ చేస్తున్న నిర్మల్ సింగ్.. అకారణంగా దాడికి గురైన విషయంలో తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి వచ్చి, అకాస్మాత్తుగా ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో బాధితుడి ముక్కు విరిగిపోయింది. కాగా.. దుస్తులుపై రక్తపు మరకలతో ఉన్న నిర్మల్ సింగ్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయి సంచలనానికి దారి తీసింది.


మరోవైపు.. ఈ కేసును చీఫ్ డిటెక్టివ్ దర్యాప్తు చేస్తున్నట్టు న్యూయార్క్ పోలీస్ కమిషనర్ కీషాంట్ సీవెల్ తెలిపారు. ఇటువంటి హింసాత్మక ఘటనలు గర్హనీయమని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.కాగా.. దాడి చేసిన వారి వివరాల గురించి తెలిస్తే పోలీసులకు తక్షణం సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు. టూరిస్ట్ వీసాపై అమెరికా వెళ్లిన రెండు వారాలకు నిర్మల్‌పై ఈ దాడి జరిగింది. ఇది జాత్యాహంకార పూరిత దాడేనని అక్కడి భారతీయులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బాధితుడికి లీగల్ విషయాల్లో సాయం చేసేందుకు సిక్ కొయెలిషన్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది.   

Updated Date - 2022-04-06T01:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising