ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IndiGo: సౌదీ, ఖతార్ వెళ్లేవారికి ఇండిగో గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2022-09-07T17:31:26+05:30

భారతీయ బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తాజాగా కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ దేశాలకు తమ నెట్‌వర్క్‌ను పెంచుకునే దిశగా కొన్ని కొత్త విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ బడ్జెట్ క్యారియర్ ఇండిగో (IndiGo) తాజాగా కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ దేశాలకు తమ నెట్‌వర్క్‌ను పెంచుకునే దిశగా కొన్ని కొత్త విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నడుస్తున్న విమాన సర్వీసులకు ఇవి అదనం అని పేర్కొంది. దీనిలో భాగంగా దోహా, దుబాయ్, రియాద్‌లకు కొత్త విమాన సర్వీసులు ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి హైదరాబాద్ టు రియాద్, దోహాకు ఓ విమాన సర్వీస్ ప్రారంభిస్తోంది. అలాగే కర్నాటక రాష్ట్రం మంగళూరు నుంచి దుబాయ్‌ (Dubai)కు అక్టోబర్ 31 నుంచి మరో విమాన సర్వీస్ నడపనున్నట్లు వెల్లడించింది. 


ఇక రియాద్-హైదరాబాద్ విమాన సర్వీస్ వారానికి రెండు రోజులు (సోమ, శనివారం) రియాద్ నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు వస్తుంది. అలాగే ఆది, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి రియాద్‌ (Riyadh)కు వెళ్తుంది. దీనికి అదనంగా డైలీ హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు ఓ విమాన సర్వీస్ ఉంటుంది. కాగా, ఈ కొత్త రూట్, అదనపు ఫ్రీక్వెన్సీలు భారత్, మధ్యప్రాచ్య దేశాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని ఎయిర్‌లైన్ నమ్మకంగా ఉంది. దీంతోపాటు గల్ఫ్ దేశాలకు తమ నెట్‌వర్క్‌ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 


Updated Date - 2022-09-07T17:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising