ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ఇంటి పేరట్లో నల్లమందు మొక్క పెంపకం.. భారత ప్రవాసుడి అరెస్ట్!

ABN, First Publish Date - 2022-04-14T13:25:26+05:30

కువైత్‌లో తన ఇంటి పేరట్లో నల్లమందు మొక్కను(ఓపియం పోపీ శాస్త్రీయ నామము) పెంచినందుకు భారతీయుడిని అక్కడి సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లో తన ఇంటి పేరట్లో నల్లమందు మొక్కను(ఓపియం పోపీ శాస్త్రీయ నామము) పెంచినందుకు భారతీయుడిని అక్కడి సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కువైత్‌లోని ఫహాహీల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే ఓ భారత ప్రవాసుడు తన ఇంటి పేరట్లో ఏకంగా నార్కోటిక్ మొక్కను పెంచుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న అహ్మది సెక్యూరిటీ అధికారులు సదరు వ్యక్తి ఇంటికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. పేరటిని సీజ్ చేసిన అధికారులు.. అందులోని మొక్కలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌కు పంపించారు. అనంతరం ఈ విషయమై జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే, అధికారులు అదుపులోకి తీసుకున్న భారతీయుడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం సదరు వ్యక్తిని అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు హాజరుపరిచే పనిలో ఉన్నారు.  

Updated Date - 2022-04-14T13:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising