ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joe Biden కొలువులో మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు

ABN, First Publish Date - 2022-07-09T16:36:17+05:30

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రభుత్వంలో పలువురు భారతీయ అమెరికన్ల (Indian Americans) పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రభుత్వంలో పలువురు భారతీయ అమెరికన్ల (Indian Americans) పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ (FDA) ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా భారత సంతతికి చెందిన విన్ గుప్తా (Vin Gupta) నియమితులయ్యారు. ఎఫ్‌డీఏ ప్రిన్సిపల్ డిప్యూటీ కమీషనర్ జానెట్ వుడ్ కాక్ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విన్ గుప్తా నియామకం జరిగింది. ఎఫ్‌డీఏ కమీషనర్‌ రాబర్ట్ కాలిఫ్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తారు. కాగా, విన్ గుప్తా ప్రస్తుతం అమెజాన్ (Amazon) చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. 2022 ఫిబ్రవరి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.  


ఇక ఎఫ్‌డీఏ చాలా కాలంగా కొత్త సలహాదారు కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పల్మోనాలజిస్ట్‌గా మంచి గుర్తింపు, ప్రముఖ న్యూస్ ఏజెన్సీలలో తరచూ కనిపించే విన్ గుప్తా ఈ పదవికి సరైన వ్యక్తిగా యూఎస్ ఎఫ్‌డీఏ (FDA) భావించింది. అంతేగాక అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో అధ్యక్షుడు బైడెన్‌కు కీలక సలహాలు ఇచ్చి ఆయన విజయంలో విన్ గుప్తా కీలకపాత్ర పోషించారు. దీంతో ఎఫ్‌డీఏ ఆయనకే ఈ పదవిని కట్టబెట్టిందని సమాచారం. సలహాదారు హోదాలో తమ హెల్త్ రికమండేషన్‌లపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఆయన కృషి చేస్తారని ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, ప్రస్తుతం అగ్రరాజ్యంలో బేబీ ఫార్ములా, అబార్షన్ హక్కులపై ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో సలహాదారు పదవి విన్ గుప్తాకు కత్తి మీద సాము అనే చెప్పాలి.

Updated Date - 2022-07-09T16:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising