ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాపై ఆంక్షల అమల్లో భారతీయ అమెరికన్‌ కీలక పాత్ర

ABN, First Publish Date - 2022-02-24T13:18:08+05:30

రష్యాపై అమెరికా ఆంక్షలను విధించడంలో భారతీయ అమెరికన్‌ ఆర్థిక సలహాదారు దలీప్‌ సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌, ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అయిన సింగ్‌.. మంగళవారం వైట్‌హౌస్‌ ప్రెస్‌ రూంలో మీడియాతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 23: రష్యాపై అమెరికా ఆంక్షలను విధించడంలో భారతీయ అమెరికన్‌ ఆర్థిక సలహాదారు దలీప్‌ సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌, ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అయిన సింగ్‌.. మంగళవారం వైట్‌హౌస్‌ ప్రెస్‌ రూంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని దీర్ఘకాలంగా భావిస్తున్న రష్యా తన పనిని మొదలుపెట్టింది. దీంతో మేం (అమెరికా) కూడా మా పని ప్రారంభించాం. అధ్యక్షుడు బైడెన్‌ వెంటనే మిత్రపక్షాలను సంప్రదించి రష్యాపై ఆంక్షలు విధించారు.మా మిత్రపక్షాల సత్తా ఏంటో కూడా చూపించాం’’ అని సింగ్‌ స్పష్టం చేశారు.


అతిపెద్ద శాంతి సంక్షోభం: ఐరాసఅంతర్జాతీయ సమాజం ఇటీవలి కాలంలో అతిపెద్ద శాంతి-భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) చీఫ్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో మంగళవారం ఐరాసలో మీడియాతో ఆయన మాట్లాడారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెస్క్‌, లుహాన్స్‌స్క్‌లను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతాలుగా రష్యా ప్రకటించడాన్ని ఖండించారు. అది ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించడమేనన్నారు. ‘‘రష్యా శాంతికాముక దేశం కాదు. వారు ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-02-24T13:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising