ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్, యూకే వెనక్కి.. ఆస్ట్రేలియన్ల టాప్ డేస్టినేషన్ భారత్

ABN, First Publish Date - 2022-04-26T16:06:53+05:30

ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్(ఏబీఎస్) సమాచారం ప్రకారం ఆస్ట్రేలియన్ల ఫేవరేట్ డేస్టినేషన్‌గా భారత్ నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్(ఏబీఎస్) సమాచారం ప్రకారం ఆస్ట్రేలియన్ల ఫేవరేట్ డేస్టినేషన్‌గా భారత్ నిలిచింది. ఇంతకుముందు యూఎస్, యూకేకు ఆ దేశ వాసులు ఎక్కువగా వెళ్లేది. కానీ, కరోనా తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గడిచిన రెండేళ్లలో ఇండియాకు వస్తున్న ఆస్ట్రేలియన్ల సంఖ్య భారీగా పెరిగితే.. ఇదే సమయంలో అమెరికా, బ్రిటన్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 20,400 మంది ఆసీస్ వాసులు భారత్ నుంచి తమ టూర్లను ముగించుకుని స్వదేశానికి చేరుకోగా.. అదే యూఎస్ నుంచి 12,760 మంది, యూకే నుంచి 8,150 మంది వచ్చినట్లు ఏబీఎస్ వెల్లడించింది.


వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రయాణ ఆంక్షలు తొలిగిపోయాయి. దీంతో గడిచిన మూడునాలుగు నెలల నుంచి ఇరు దేశాల మధ్య ప్రయాణాలు అమాంతం పెరిగాయని ఏబీఎస్ పేర్కొంది. ఇక ఆ దేశంలో భారతీయులు భారీగానే ఉంటారనే విషయం తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం మనోళ్లు సుమారు 7.21లక్షల మంది అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, భారత్ కంటే యూకే 9,80,400 మందితో టాప్‌లో ఉంది.   

Updated Date - 2022-04-26T16:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising