ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడారి దేశాలలో కూడా ‘హర్ ఘర్ తిరంగా’

ABN, First Publish Date - 2022-08-16T01:37:25+05:30

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశ విదేశాలలోని ప్రవాసీయులు ఘనంగా జరుపుకోన్నారు, హర్ ఘర్ తిరంగా ఎడారి దేశాలలో కూడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశ విదేశాలలోని ప్రవాసీయులు ఘనంగా జరుపుకోన్నారు, హర్ ఘర్ తిరంగా ఎడారి దేశాలలో కూడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ భారతీయ దౌత్య కార్యాలయాలతో పాటు అనేక కంపెనీలు, లేబర్ క్యాంపులలో జెండా పండుగ ఘనంగా జరిగింది. గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రతికూల వాతవారణ పరిస్ధితులను కూడా లెక్కచేయకుండా కోవిడ్ ఆంక్షల తర్వాత జరుగుతున్న జెండావిష్కరణ కార్యక్రమంలో ప్రవాసీయులు పాల్గోన్నారు. ​ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధవంత నాయకత్వం వలన భారతీయ జాతీయ జెండాకు గౌరవం మరింత పెరిగిందని యు.ఏ.ఇలోని భారతీయ రాయబారి సంజయ్ సుధీర్ తన ప్రసంగంలో పెర్కోన్నారు. భారతీయ త్రివర్ణ పతాకం పట్టడం లేదా భారతీయ పాస్‌పోర్ట్ కల్గి ఉండడంతో భారతీయులు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందగల్గుతున్నారంటూ ఆయన జాతీయ పతాకవిష్కరణ అనంతరం చెప్పారు. దుబాయిలోని అరేబియా సముద్ర తీరం లాంచీలపై త్రివర్ణ పతాకాలతో భారతీయులు తిరిగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


దుబాయిలో కాన్సల్ జనరల్ అమన్ పూరీ జాతీయ పతాకావిష్కరణ చేసి రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివారు. సౌదీ అరేబియాలోని అరేబియా సముద్ర తీరంలో భారీ ప్రాజెక్టులో పని చేస్తున్న తెలుగు వారితో పాటు భారతీయులందరు కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషాన్ని కల్గించిందని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం దాంరాజ్ పల్లికి చెందిన వడ్ల లక్ష్మీనారాయాణ చారి చెప్పారు. హర్ ఘర్ తిరంగాను రియాధ్ నగరంలోని తమ ఇంటిపై తాము పాటించామని హైద్రాబాద్ నగరానికి చెందిన సి.హెచ్.శివారెడ్డి చెప్పారు. భారతీయ కాన్సులేటు అవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గోనడం మరింత జాతీయస్ఫూర్తిను కల్గించిందని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాటా అధ్యక్షుడు యస్. మల్లేశం, హైద్రాబాద్ నగరానికి చెందిన మీర్జా ఖుద్రత్ నవాజ్‌లు పెర్కోన్నారు. ​కువైత్ నగరంలో 100 బస్సులపై భారతీయ త్రివర్ణ పతాక రంగులను వేయించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించగా షార్జాలోని లేబర్ క్యాంపులో కార్మికుల హక్కుల గూర్చి తెలియజేస్తూ దీన్ని పాటించారు. ఖతర్, బహ్రెయిన్ మరియు ఒమాన్‌లలో కూడా జాతీయ పండుగ ఘనంగా జరిగింది. 









Updated Date - 2022-08-16T01:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising