Budget-2022: NRIలకు ప్రయోజనం ఎంత..?
ABN, First Publish Date - 2022-02-02T03:09:22+05:30
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మంత్రి ‘డిజిటల్ భారత్’ నిర్మాణమే లక్ష్యంగా పలు అంశాలను ప్రస్తావించారు. 5జీ సేవలు, హైటెక్ వ్యవసాయం, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీ వంటి కీలక విషయాలను మంత్రి పేర్కొన్నారు. ఇక బడ్జెట్‌లో ఎన్నారైలకు మేలు చేకూర్చే..
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మంత్రి ‘డిజిటల్ భారత్’ నిర్మాణమే లక్ష్యంగా పలు అంశాలను ప్రస్తావించారు. 5జీ సేవలు, హైటెక్ వ్యవసాయం, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీ వంటి కీలక విషయాలను మంత్రి పేర్కొన్నారు. ఇక బడ్జెట్‌లో ఎన్నారైలకు మేలు చేకూర్చే పలు అంశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా త్వరలో అందుబాటులోకి రాబోయే డిజిటల్ రూపీ ద్వారా ఎన్నారైలు మరింత సులువుగా, తక్కువ ఖర్చుతో స్వదేశానికి నగదు బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ-పాస్‌పోర్టుల ద్వారా విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. విదేశీ వ్యవహారాల శాఖ, ఆదాయపు పన్ను శాఖకు కూడా ఈ-పాస్‌పోర్టులోని మైక్రోచిప్‌లోగల వివరాలు అనుసంధానం కావడంతో మరి కొన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయని నిపుణుల అభిప్రాయం. ఇక పన్ను చెల్లింపులకు సంబంధించి ఎసెస్‌మెంట్ ఇయర్ నుంచి మరో రెండేళ్ల పాటు టాక్స్ రిటర్న్స్‌ను అప్‌డేట్ చేసే అవకాశం ఉండటం ఎన్నారైలకు లాభిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2022-02-02T03:09:22+05:30 IST