ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian American Day: డాలస్‌లో ‘ఇండియన్ అమెరికన్ డే’గా పంద్రాగస్టు!

ABN, First Publish Date - 2022-08-12T02:52:42+05:30

భారతదేశ స్వాతంత్ర్య(Independence day) వజ్రోత్సవాల సందర్భంగా డల్లాస్(Dallas) నగర్ మేయర్ ఎరిక్ జాన్సన్ డాలస్ సిటీహాల్ లో కొద్దిమంది ప్రవాస భారతీయ నాయకులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆగస్ట్ 15 వ తేదీని డాలస్ లో “ఇండియన్ అమెరికన్ డే” గా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాలస్(టెక్సాస్): భారతదేశ స్వాతంత్ర్య(Independence day) వజ్రోత్సవాల సందర్భంగా డాలస్(Dallas) నగర మేయర్ ఎరిక్ జాన్సన్ డాలస్ సిటీహాల్‌లో కొద్దిమంది ప్రవాసీ భారతీయ నాయకులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆగస్ట్ 15వ తేదీని డాలస్‌లో “ఇండియన్ అమెరికన్ డే” గా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.


మేయర్ జాన్సన్ మాట్లాడుతూ డాలస్, ఫోర్ట్‌వర్త్ నగర పరిసర ప్రాంతాలలో దాదాపు 2 లక్షలమంది ప్రవాస భారతీయులు నివసిస్తూ విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి శ్లాఘనీయమైనదన్నారు. ఉత్తరటెక్సాస్‌లో ప్రవాస భారతీయులు వివిధ వ్యాపార రంగాలలో స్థిరపడి 10 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని సృష్టిస్తూ ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి తోడ్పడుతున్నందుకు హార్దిక కృతజ్ఞతలు తెలియజేశారు. 


డాలస్ నగర మేయర్ ఆత్మీయ ఆహ్వానం మేరకు ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసీ భారతీయ నాయకులు అరుణ్ అగర్వాల్, సల్మాన్ ఫర్ షోరి, రజనీష్ గుప్తా, డా. ప్రసాద్ తోటకూరలకు మేయర్ ఎరిక్ జాన్సన్ ఆగస్ట్ 15వ తేదీని డాలస్‌లో “ఇండియన్ అమెరికన్ డే”గా గుర్తిస్తున్నట్లు ప్రకటించి, అధికారిక పత్రాన్ని ప్రదానం చేశారు.        








Updated Date - 2022-08-12T02:52:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising