TANA: తానా ఆధ్వర్యంలో న్యూయార్క్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ABN, First Publish Date - 2022-08-24T03:32:44+05:30
న్యూయార్క్ నగరం(New york) నడిబొడ్డున ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా(TANA) వారు 75వ భారత స్వాతంత్ర సంబరాలను(Independence day celebrations) ఘనంగా నిర్వహించారు.
న్యూయార్క్ నగరం(New york) నడిబొడ్డున ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA - తానా) వారు 75వ భారత స్వాతంత్ర్య సంబరాలను(Independence day celebrations) ఘనంగా నిర్వహించారు. FIA ఆధ్వర్యంలో అన్ని భారత సంఘాలు పాలుపంచుకున్న ఈ పరేడ్లో తానా వారి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నారులు ప్రదర్శించిన లంబాడీ నృత్యాలు, దేశభక్తిగీతాలు, కూచిపూడి నృత్యాలు, అల్లూరి సీతారామ రాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఝాన్సీ లక్ష్మీబాయి వేషాలు న్యుయార్క్ నగరంలో సందర్శకులందరనీ ఆకట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం న్యూయార్క్ నగరంలో లక్షలాదిమంది భారతీయులందరు పాల్గొనే ఈ సంబరాలలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథులుగా పాల్గొనడం తెలుగు వారికి గర్వకారణమని అందరూ కొనియాడారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక తెలుగు వాడిగా దేశం మొత్తం జరుపుకునే ఈ పండుగలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తానా పరేడ్ ఫ్లోట్ని తెలుగు స్వాతంత్ర్య సమర యోధుల చిత్రాలతో, భారత జాతీయ జెండాలు, తానా జెండాలు, మువన్నెల బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా ఎప్పుడు మాతృదేశానికి సేవ చేయడానికి ముందుంటుందని చెప్పారు. తానా సేవల సమన్వయకర్త రాజా కసుకుర్తి, బోర్డ్ కోశాధికారి లక్ష్మి దేవినేని మాట్లాడుతూ అమెరికాలో ఉన్నా తామందరం తానా ద్వారా కర్మ భూమితో పాటు మాతృభూమికి సేవ చేయటానికి ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయ్ తాల్లూరి, జాని నిమ్మలపుడి, శ్రీనివాస్ ఒరుగంటి, విద్య గారపాటి, దిలీప్ ముసునూరు, శిరీష, శ్రీ కొనంకి, సుధీర్ నారెపలెపు, శివాని, శ్రీ అట్లూరి, శ్రీలక్ష్మి అద్దంకి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-24T03:32:44+05:30 IST