ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwaitలో గణనీయంగా తగ్గిన ప్రవాస కార్మికుల సంఖ్య.. ముందు సంవత్సరంతో పోల్చితే 2021లో..

ABN, First Publish Date - 2022-06-18T13:23:31+05:30

కువైత్‌లో ప్రవాస కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన సెంట్రల్ స్టాటిస్టికల్‌ బ్యూరోనే వెల్లడించింది. 2020తో పోల్చితే.. 2021లో ప్రవాస కార్మికుల సంఖ్య భారీ మొత్తంలో తగ్గినట్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కువైత్‌లో ప్రవాస కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన సెంట్రల్ స్టాటిస్టికల్‌ బ్యూరోనే వెల్లడించింది. 2020తో పోల్చితే.. 2021లో ప్రవాస కార్మికుల సంఖ్య భారీ మొత్తంలో తగ్గినట్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది. కాగా.. ఆ వివరాలను ఓసారి పరిశీలిస్తే..


కువైత్ సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021 డిసెంబర్ నాటికి 1.8 మిలియన్ల మంది పలు దేశాలకు చెందిన ప్రవాస కార్మికులు పబ్లిక్, ప్రైవేట్ విభాగాల్లో పని చేస్తున్నారు. అదే 2020 డిసెంబర్‌‌లో ఈ ప్రవాస కార్మికుల సంఖ్య 1.993 మిలియన్లు ఉన్నట్టు స్టాటిస్టికల్ బ్యూరో పేర్కొంది. 2020తో పోల్చితే 2021లో ప్రవాస కార్మికుల సంఖ్య దాదాపు 1,34,000 వరకూ తగ్గిందని తెలిపింది. ఇదే సమయంలో కువైత్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వివరించింది. దీంతో కువైత్ లేబర్ మార్కెట్‌లో ఆ దేశ కార్మికుల సంఖ్య 4,30,128‌కు పెరిగినట్లు చెప్పింది. అంతేకాకుండా ఈజిస్ట్‌కు చెందిన 4,51,000 మంది ప్రవాసులు, 4,37,116 మంది భారతీయులు కువైత్‌లో కార్మికులుగా పని చేస్తున్నట్టు తెలిపింది. 




Updated Date - 2022-06-18T13:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising