ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAEలో ఎవరైనా ఈ పని చేశారో.. ఇక అంతే.. రూ.4కోట్ల ఫైన్‌తోపాటు జైలుశిక్ష కూడా!

ABN, First Publish Date - 2022-06-18T14:29:08+05:30

యూఏఈలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాగా.. అక్కడి అధికారులు తాజాగా కీలక విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ అకౌంట్లను వేదికగా చేసుకుని.. ఎవరైనా ప్రజలను తప్పుదో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: యూఏఈలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాగా.. అక్కడి అధికారులు తాజాగా కీలక విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ అకౌంట్లను వేదికగా చేసుకుని.. ఎవరైనా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియోను శుక్రవారం రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



యూఏఈలోని ఫెడరల్ డిక్రీ లా నెం.34లోని ఆర్టికల్ 55 ప్రకారం.. పుకార్లు సృష్టించడం, సైబర్ నేరాలకు పాల్పడటం నేరం. ఎవరైనా ఈ నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ అవగాహన వీడియోను అధికారులు విడుదల చేశారు. చట్టవిరుద్ధమైన, అసత్య ప్రచారాన్ని వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ అకౌంట్లలో పోస్ట్ చేయాలని కోరడం, ప్రచురించడం రెండూ తప్పే. ఇటువంటి చర్యల ద్వారా లబ్ధి పొందే వ్యక్తులు చట్ట ప్రకారం శిక్షార్హులు. ఈ  నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం సదరు వ్యక్తులు దాదాపు రూ.4కోట్ల (2మిలియన్ల దిన్హార్లు) వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. సదరు కంటెంట్‌ను ప్రచురించిన ఆన్‌లైన్ అకౌంట్, వెబ్‌సైట్ నిర్వాకులతోపాటు.. అటువంటి సమాచారం అలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటన స్థలాన్ని అద్దెకు తీసుకున్న లేదా కొనుగోలు చేసే ఏ వ్యక్తికైనా అదే పెనాల్టీ వర్తిస్తుందని అధికారులు వీడియో స్పష్టం చేశారు.


Updated Date - 2022-06-18T14:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising