ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bumper offer: హైదరాబాద్ విద్యార్థికి బంపరాఫర్.. అమెరికన్ యూనివర్శిటీ రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌

ABN, First Publish Date - 2022-08-06T18:59:43+05:30

హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ విద్యార్థికి బంపర్ ఆఫర్ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్‌: హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ విద్యార్థికి బంపర్ ఆఫర్ వచ్చింది. 18 ఏళ్ల వేదాంత్‌ ఆనంద్‌వాడే (Vedant Anandwade)కు అమెరికా (America)లోని ప్రముఖ కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం (Case Western Reserve University) బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ. 1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ ఆఫర్ చేసింది. దీనికి సంబంధించిన అంగీకార ప్రతాన్ని, స్కాలర్‌షిప్‌ లేఖను యూనివర్శిటీ తాజాగా ఆనంద్‌వాడేకు పంపించింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐసీఎస్‌ఈ (ICSE) సిలబస్‌తో 12వ తరగతిని పూర్తి చేసిన ఆనంద్‌వాడే ఇప్పుడు అగ్రరాజ్యంలో న్యూరోసైన్స్‌ చదవనున్నాడు. విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్‌ అతన్ని గుర్తించి తగిన మార్గదర్శకం చేసింది. 


ఈ సందర్భంగా ఆనంద్‌వాడే మాట్లాడుతూ.. ఇంత గొప్ప అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. వైద్య శాస్త్రంలో కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందని తెలిపాడు. ఇప్పటివరకు 17 మంది నోబెల్ పుస్కార గ్రహీతలను అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. అలాంటి విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌ (Scholorship) లభించడమనేది చాలా గొప్ప విషయమని అన్నాడు. ఆనంద్‌వాడే తండ్రి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డెంటిస్ట్ (Dentist)గా పనిచేస్తుంటే, తల్లి ఫిజియోథెరపిస్ట్‌. కాగా, ఈ నెల 12న ఆనంద్‌వాడే యూఎస్‌ (US)కు బయల్దేరి వెళ్లనున్నాడు. 

Updated Date - 2022-08-06T18:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising