ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ ‘ట్రూత్ సోషల్’కు భారీ డిమాండ్

ABN, First Publish Date - 2022-02-24T02:01:06+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా యాప్ ‘ట్రూత్ సోషల్’కు భారీ డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి యాపిల్ యాప్ స్టోర్‌లోకి ఆ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. అయితే సోమవారం ఉదయానికే స్టోర్ టాప్ చార్ట్‌లో ‘ట్రూత్ సోషల్’ యాప్ మొదటి స్థానానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా యాప్ ‘ట్రూత్ సోషల్’కు భారీ డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి యాపిల్ యాప్ స్టోర్‌లోకి ఆ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. అయితే సోమవారం ఉదయానికే స్టోర్ టాప్ చార్ట్‌లో ‘ట్రూత్ సోషల్’ యాప్ మొదటి స్థానానికి చేరుకుంది. పెద్ద మొత్తంలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో.. అకౌంట్ క్రియేట్ చేసుకోవడంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక సైనప్ అయిన వారికి సైతం వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచినట్టు మెసేజ్ కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. 



కాగా.. అధ్యక్ష ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ట్రంప్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పదేపదే ఆరోపించారు. ఈ క్రమంలోనే గత ఏడాది జనవరి 6న కేపిటల్ హిల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. ట్రంప్ ప్రోత్సాహంతోనే ఆయన మద్దతుదారులు ఈ దాడులు చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ సంస్థలు ట్రంప్ ఖాతాలపై నిలిపి వేశాయి. దీంతో ఆగ్రహానికి లోనైన ట్రంప్.. సొంతంగా సోషల్ మీడియా వేదికను రూపొందించుకోనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ‘ట్రూత్ సోషల్’ అందుబాటులోకి వచ్చింది. 




Updated Date - 2022-02-24T02:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising