ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arnold Schwarzenegger: తృటిలో తప్పిన పెను ప్రమాదం!

ABN, First Publish Date - 2022-01-23T18:01:43+05:30

అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో హాలీవుడ్‌ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ తృటిలో కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ ఏంజిలిస్: అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో హాలీవుడ్‌ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ తృటిలో కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ స్వల్పంగా గాయపడింది. దాంతో వెంటనే ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. లాస్ ఏంజిలిస్‌లోని రివేరియా కంట్రీ క్లబ్‌కు సమీపంలో ఉన్న సన్‌సెట్ బౌలేవార్డ్, అలెన్‌ఫోర్డ్ అవెన్యూ కూడలిలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదం కారణంగా మరో రెండు కార్లు కూడా ఇరుక్కుపోయాయి. 74 ఏళ్ల స్టార్ ఆర్నాల్డ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై లాస్ ఏంజిలిస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. కాగా, ప్రమాద సమయంలో స్క్వార్జెనెగర్ మద్యం సేవించి ఉన్నారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉందని లాస్ ఏంజిలిస్ పోలీసులు తెలిపారు. ఇక ప్రమాదం నుంచి స్క్వార్జెనెగర్ సురక్షితంగా బయటపడడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   


Updated Date - 2022-01-23T18:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising