ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: ఉమ్రా యాత్రికులకు సౌదీ తీపి కబురు.. అతి తక్కువ సమయంలోనే మక్కా, మదీనాల సందర్శన

ABN, First Publish Date - 2022-09-17T13:28:18+05:30

ఉమ్రా యాత్రికుల (Umrah pilgrims) కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్ హరమైన్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు తాజాగా సౌదీ అరేబియా సర్కార్ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెడ్డా: ఉమ్రా యాత్రికుల (Umrah pilgrims) కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్ హరమైన్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు తాజాగా సౌదీ అరేబియా సర్కార్ వెల్లడించింది. ప్రపంచం నలుమూలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా పవిత్రమైన మక్కా (Makkah), మదీనాలను సందర్శిస్తుంటారు. అయితే, ఈ రెండు పవిత్ర నగరాలను సందర్శించే యాత్రకులకు సమయం ఆదా చేసేందుకు హై స్పీడ్ ట్రైన్‌ను (High speed train) నడుపుతున్నట్లు సౌదీ ప్రకటించింది. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం మక్కా, మదీనా (Madinah) మధ్య జెడ్డా, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీలో సర్వీస్ స్టాప్‌లు కూడా ఉన్నాయి. ఈ ట్రైన్ గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైల్లో వెళ్లేవారు కేవలం రెండు గంటల ఇరవై నిమిషాల్లో మక్కా నుంచి మదీనాకు చేరుకోవచ్చు. 


అలాగే మదీనా నుంచి మక్కాకు రావడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఇక ట్రైన్ టికెట్ ధరలు నలభై రియాళ్ల (రూ.848) నుంచి 150 రియాళ్ల (రూ.3181)వరకు ఉంటాయి. ఇందులో బిజినెస్, ఎకనామీ క్లాస్‌లు ఉంటాయి. అందుకే టికెట్ల ధరలలోనూ వ్యత్యాసం ఉంటుంది. సుమారు 400 మంది వరకు ఒకేసారి ఈ హైస్పీడ్ ట్రైన్‌లో ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ అవకాశాన్ని ఉమ్రా యాత్రికులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు కోరారు. కాగా, హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ (Ministry of Hajj and Umrah) ఇచ్చిన అనుమతి ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు విజిట్ వీసాపై దేశంలో ఉండి ఉమ్రా చేయడానికి అనుమతించడం జరుగుతుంది. 


ఉమ్రా యాత్రికులకు (Umrah pilgrims) ఇబ్బంది కలగకుండా సాంస్కృతిక, మతపరమైన అనుభవానికి ప్రాధాన్యతనిచ్చేలా సౌదీ విజన్-2030 లక్ష్యాలకు అనుగుణంగా విజిట్ వీసాపై దేశంలో ఉమ్రాకు సౌదీ అరేబియా (Saudi Arabia) అనుమతిస్తుంది. ఇక ఉమ్రా చేయడానికి సౌదీ అరేబియాను సందర్శించాలనుకునే యాత్రికులు 'మకామ్' (maqam) ప్లాట్‌ఫారమ్ SagaS.cIs.ean.cqN.sa ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన అన్ని ప్రయాణ ఏర్పాట్లను మకామ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సర్వీస్ ప్యాకేజీ నుంచి ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఫ్యామిలీ, వ్యక్తిగత విజిట్ వీసా (Visit visa) హోల్డర్లు ఉమ్రా యాప్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం ద్వారా సులభంగా ఉమ్రా చేయవచ్చు. అయితే, విదేశీ ఉమ్రా యాత్రికులు కోవిడ్-19 (Covid-19) చికిత్సకు అయ్యే ఖర్చుతో సహా సమగ్ర ఆరోగ్య బీమా తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2022-09-17T13:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising