ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold Rates: గ్రాము బంగారం ధర రూ.5,089.. మరి మన దగ్గరతో పోల్చితే Kuwait లో బంగారం ధర ఎంత తక్కువంటే..

ABN, First Publish Date - 2022-09-03T17:13:04+05:30

గల్ఫ్ దేశాలలో పసిడి ధరలు (Gold Rates) మన దగ్గర కంటే చాలా చౌకగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: గల్ఫ్ దేశాలలో పసిడి ధరలు (Gold Rates) మన దగ్గర కంటే చాలా చౌకగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే మనోళ్లు అక్కడి నుంచి స్వదేశానికి వచ్చినప్పుడల్లా ఎంతోకొంత బంగారాన్ని తీసుకురావడం చేస్తుంటారు. ఇక ఇక్కడ ఉన్నవాళ్లు తమ బంధువులు ఎవరైనా గల్ఫ్ దేశాల్లో ఉంటే.. వారితో బంగారాన్ని కొని తెప్పించుకుంటుంటారు కూడా. అంతేందుకు పసిడి అక్రమ రవాణా కూడా గల్ఫ్ దేశాల (Gulf Countries) నుంచే ఎక్కువగా అవుతుంటుంది. దీనికి సంబంధించిన ఘటనలు కనీసం రోజుకు ఒక్కటైనా వార్తల్లో నిలుస్తుంటాయి. ఫలానా విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం (Gold) పట్టుబడిందనో, ఆ ఎయిర్‌పోర్టులో గల్ఫ్ నుంచి వచ్చిన విమానంలో అక్రమంగా తరలిస్తున్న పసిడిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారనో వంటి న్యూస్‌లను మనం తరచూ న్యూస్ ఛానెల్స్‌లో చూడడం, వార్త పత్రికల్లో చదవడం చేస్తుంటాం. దీనిబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గల్ఫ్ దేశాల్లో (Gulf countries) మన దగ్గరితో పోలిస్తే బంగారం విలువ తక్కువగా ఉంటుందనే విషయం. అసలు ఈ బంగారం ధరలు ఇక్కడితో పోల్చితే ఎంత తక్కువ ఉంటాయి..? అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం.


దీనికోసం ఇవాళ్టి (శనివారం) బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే.. ముందుగా కువైత్‌లో (Kuwait) 24 క్యారెట్ల పసిడి విలువ (గ్రాముకు) 17.150 కువైటీ దినార్లు(రూ.4,523)గా ఉంటే.. ఇదే 24 క్యారెట్ల బంగారం విలువ (గ్రాముకు) మన దగ్గర రూ. 5,089. తేడా చూస్తే రూ.566 అవుతుంది. అదే 10 గ్రాముల బంగారం కొనాలంటే కువైత్‌లో రూ.45,230 అయితే, మన దగ్గర రూ.50,890 అవుతుంది. అంటే రూ. 5,660 ఎక్కువ చెల్లిస్తే గానీ మన దగ్గర తులం బంగారం కొనుగోలు చేయలేము. 


అదే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. కువైత్‌లో గ్రాముకు 16.500 కువైటీ దినార్లు(రూ.4,264) ఉంటే.. మన ఇండియాలో దీని విలువ రూ. 5,062 పలుకుతుంది. తేడా వచ్చేసి రూ. 798. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం కొనాలంటే కువైత్‌లో రూ.42,640 అయితే, మన దగ్గర రూ.50,620 అవుతుంది. అంటే రూ. 7,980 ఎక్కువ చెల్లిస్తే గానీ మన దగ్గర తులం బంగారం రాదు. ఇలా మన దగ్గర కంటే గల్ఫ్ దేశాల్లో పసిడి ధరలు దాదాపు రూ.5 నుంచి రూ.10వేల వరకు తక్కువగా ఉంటాయి. అందుకే మనోళ్లు అక్కడి నుంచి స్వదేశానికి బంగారాన్ని తీసుకువస్తుంటారు. 


Updated Date - 2022-09-03T17:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising