ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాటంకంగా ఘంటసాల స్వరరాగ మహాయాగం!

ABN, First Publish Date - 2022-01-24T03:21:44+05:30

అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా 366 రోజులపాటు జరగనున్న "ఘంటసాల స్వర రాగ మహాయాగం" కార్యక్రమం నిరాటంకంగా 50వ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా 366 రోజులపాటు జరగనున్న "ఘంటసాల స్వర రాగ మహాయాగం" కార్యక్రమం నిరాటంకంగా 50వ రోజుకు చేరుకుంది. "ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్" "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" "వంశీ ఇంటర్నేషనల్", "శుభోదయం గ్రూప్స్" ఈ కార్యక్రమాన్ని  సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఖతార్, బహరైన్, ఒమాన్, అమెరికా మొదలైన దేశాల నుంచి గాయనీగాయకులు పాల్గొని ఘంటసాల గీతాలను ఆలపించారు. 


50వ రోజు సందర్భంగా శిరోమణి డా. వంశీ రామరాజు ఘంటసాల మందిరంలో దీపారాధన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విజయనగరం నుండి లలితా అలమేలు మంగ, జడ్చర్ల నుండి శైలజామూర్తి.. చక్కటి వైవిధ్యభరితమైన ఘంటసాల పాటలను ఎన్నుకుని ఆలపించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా , సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం అయిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షించి ఆనందించారు.

Updated Date - 2022-01-24T03:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising