ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్మనీలో కలకలం.. నావికాదళ అధిపతి అనూహ్య రాజీనామా..!

ABN, First Publish Date - 2022-01-23T23:05:57+05:30

యూక్రెయిన్ విషయంలో దూకుడుగా ఉన్న రష్యా తన తీరుతో ఐరోపా అంతటా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే జర్మనీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేసిన జర్మనీ నావికాదళ అధిపతి తన పదవికి రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్: యూక్రెయిన్ విషయంలో దూకుడుగా ఉన్న రష్యా తన తీరుతో ఐరోపా అంతటా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే జర్మనీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేసిన జర్మనీ నావికాదళ అధిపతి కే అచిమ్ షాన్‌బాఖ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. శుక్రవారం అంతర్జాతీయ వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘యూక్రెయిన్‌ దేశంలో ఓ చిన్న భూభాగాన్ని రష్యా నిజంగానే ఆక్రమించనుందా..? అంటే కానేకాదని చెప్పాలి. అదంతా నాన్‌సెన్స్. వాస్తవానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఐరోపా సమాఖ్యపై(ఈయూ) ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనిపిస్తోంది. ఈ విషయంలో ఈయూ దేశాల్లో అభిప్రాయబేధాలు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈయూ తనను గౌరవించాలని ఆయన కోరుకుంటున్నారు. నన్నడిగితే.. పుతిన్ కోరుకున్నది చేయడం సులువే..’’ అని వ్యాఖ్యానించారు. 


నిజానికి నేవీ చీఫ్ వ్యాఖ్యలు జర్మనీ అధికారిక విధానానికి వ్యతిరేకం. అంతేకాకుండా.. యూక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందేమోనని నాటో, ఈయూ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈయూ సభ్య దేశమైన జర్మనీ ఈయూకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడుతోంది. అయితే.. ఓ అంతర్జాతీయ వేదికపై జర్మనీ నావికాదళ అధిపతి ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడి ప్రభుత్వం ఇబ్బందికర స్థితిలో పడింది. 


ఈ వ్యాఖ్యల ఫలితంగా యూక్రెయిన్‌లో కలకలం రేగింది. ప్రభుత్వం జర్మనీ రాయబారితో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు.. జర్మనీలోనూ నేవీ అధిపతిపై విమర్శలు చెలరేగాయి. ఫలితంగా.. ఆ మరుసటి రోజే షోహెన్‌బాఖ్ నేవీ అధిపతి పదవికి దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాము నాటో కూటమితోనే ఉన్నామంటూ జర్మనీ ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. యూక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగా హెచ్చరించింది. 

Updated Date - 2022-01-23T23:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising