ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai Duty Free Raffle: అదృష్టమంటే ఇతడిదే.. రాత్రికి రాత్రే ఖాతాలోకి ఏడున్నర కోట్లు!

ABN, First Publish Date - 2022-04-14T14:50:38+05:30

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. రోజూ లాటరీలు కొంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక అలాంటి వారికి లాటరీ తగిలితే.. నిన్నటివరకు సాదాసీదా జీవితం గడిపినవారు రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు. తాజాగా యూకేలో ఉండే జర్మన్ వ్యక్తి విషయంలో ఇదే జరిగింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లాటరీలో మార్కస్ ఫెల్మాన్‌ అనే జర్మన్ దేశస్థుడికి జాక్‌పాట్ తగిలింది. 


బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో మార్కస్ ఏకంగా 1మిలియన్ డాలర్లు(రూ.7.60కోట్లు) గెలుచుకున్నాడు. మార్చి 19వ తేదీన అతడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ 386, లాటరీ టికెట్ నం.1653 మార్కస్‌కు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీంతో రాత్రికి రాత్రే అతడి బ్యాంక్ ఖాతాలోకి రూ.7.60కోట్లు వచ్చిపడ్డాయి. అంతే.. అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా ఊహించలేదని మార్కస్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా, 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్‌లో 1మిలియన్ డాలర్లు గెలుచుకున్న జర్మన్ వ్యక్తుల్లో మార్కస్ ఎనిమిదో వాడు.   

Updated Date - 2022-04-14T14:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising