ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: ఇర్వింగ్‌లో ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు

ABN, First Publish Date - 2022-09-11T18:24:06+05:30

డల్లాస్ నగరం (Dalla city) సమీపంలోని ఇర్వింగ్ (Irving) సిటీలోని రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో వినాయక చవితిని (Ganesh Chaturthi) ప్రవాస కమ్యూనిటీ సభ్యులు అందరు ఒక కుటుంబంలా కలిసి ఘనంగా జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇర్వింగ్: డల్లాస్ నగరం (Dalla city) సమీపంలోని ఇర్వింగ్ (Irving) సిటీలోని రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో వినాయక చవితిని (Ganesh Chaturthi) ప్రవాస కమ్యూనిటీ సభ్యులు అందరు ఒక కుటుంబంలా కలిసి ఘనంగా జరుపుకున్నారు. లేబర్ డే సెలవు రోజు కలిసిరావడంతో నిమజ్జనంతో కలిపి ఆరు రోజులు భక్తిశ్రద్ధలతో నిత్య పూజలతో మండపంలో కోలాహాలం నెలకొంది. రోజుకో అలంకరణతో పిల్లలు పెద్దల ఆటపాటలతో మండపం కళకళలాడింది. ప్రతిరోజు సాంప్రదాయ కీర్తనలు, శ్లోకాలు, భజనలు, నృత్యం, పాటలు, మరియు చక్కనైన ఉపన్యాసాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని అతిథులని అలరించారు. 


ఇండియా నుండి వచ్చిన ఎన్నారైల (NRIs) తల్లిదండ్రులు కూడా పిల్లలతో పోటీగా నృత్యం చేసి మనవళ్లకి మనవరాళ్లకి మరుపురాని జ్ఞాపకాలని పంచారు. ఎప్పటిలానే లడ్డు వేలం ఈ సంవత్సరం కూడా చాల హుషారుగా నడిచింది. మొత్తం 13 లక్షలకు పైగా  పాట పాడుకోవడం జరిగింది. పండుగ ఐదవ రోజు అయిన శనివారం నాడు పెట్టిన బంతి భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా నిలిచాయి.  


తెలుగు సంప్రదాయమైన పంచె కట్టుతో, ఆప్యాయతలతో దాదాపు 350 మంది అతిథులకు ఎన్నో రకాల పిండి వంటలతో రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. చివరి రోజైన నిమజ్జనం రోజున వినాయకుడి ముందు పిల్లలు, పెద్దలు రంగులతో ఎంతో సంతోషంగా హోలీ,  దాండియా ఆడారు. దాంతో స్వదేశంలో ఉండే  పండగ వాతావరణాన్ని డల్లాస్‌కి తీసుకువచ్చినట్లైంది. వేడుకుల ముగింపుగా గణపతిని పుర విధులలో ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేశారు.




Updated Date - 2022-09-11T18:24:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising