ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమె నా డీఎన్ఏ దొంగిలిస్తోంది.. కదులుతోన్న విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ఆ తరువాత..

ABN, First Publish Date - 2022-02-11T01:36:22+05:30

విమాన సిబ్బంది నచ్చ చెబితే కాసేపు శాంతించి, మళ్లీ రాద్ధాంతం చేయడం ప్రారంభించాడు. సిబ్బంది నచ్చ చెప్పిన కొద్దీ అతడు మరింతగా రెచ్చిపోయి అందరినీ చంపేస్తా అంటూ నానాయాగీ చేశాడు. దీంతో.. సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పైలట్ విమానాన్ని రైలీ డర్హమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. అనంతరం.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కాగా.. నిందితుడి వెనక సీట్లో ఉన్న మహిళ పక్కనే ఆమె కుమారుడు కూర్చుని ఉన్నాడని ఇతర ప్రయాణికులు తెలిపారు. అతడు ఆటిజమ్ రుగ్మతతో బాధపడుతున్నాడని, ఫలితంగా అతడు పలుమార్లు కాలు కదపడంతో ముందు సీట్లోని వ్యక్తికి కాలు తగిలిందని చెప్పుకొచ్చారు. అయితే..నిందితుడు మాత్రం అకస్మాత్తుగా చిత్తభ్రాంతికి లోనై కలకలం రేపాడని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తోటి ప్రయాణికురాలు తన డీఎన్ఏ దొంగిలిస్తోదంటూ ఓ ప్రయాణికుడు రచ్చరచ్చ చేయడంతో విమానం అత్యవసరంగా ల్యాండవ్వాల్సి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఓర్లాండోకు వెళుతున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇతర ప్రయాణికుల కథనం ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే నిందితుడు అసహజంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. వెనక సీట్లో కూర్చున్న మహిళ తన శరీరంలో సూది గుచ్చి డీఎన్‌ఏ దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందంటూ పెద్దపెట్టున గొడవ చేయడం ప్రారంభించాడు. 


విమాన సిబ్బంది నచ్చ చెబితే కాసేపు శాంతించి, మళ్లీ రాద్ధాంతం చేయడం ప్రారంభించాడు. సిబ్బంది నచ్చ చెప్పిన కొద్దీ అతడు మరింతగా రెచ్చిపోయి అందరినీ చంపేస్తా అంటూ నానాయాగీ చేశాడు. అతడిని అదుపు చేసేందుకు సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పైలట్ విమానాన్ని రైలీ-డర్హమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. అనంతరం.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కాగా.. నిందితుడి వెనక సీట్లో ఉన్న మహిళ పక్కనే ఆమె కుమారుడు కూర్చుని ఉన్నాడని ఇతర ప్రయాణికులు తెలిపారు. అతడు ఆటిజమ్ రుగ్మతతో బాధపడుతున్నాడని, ఫలితంగా అతడు పలుమార్లు కాలు కదపడంతో ముందు సీట్లోని నిందితుడికి కాలు తగిలిందని చెప్పుకొచ్చారు. అయితే..నిందితుడు మాత్రం అకస్మాత్తుగా  చిత్తభ్రాంతికి లోనై కలకలం రేపాడని పేర్కొన్నారు.

Updated Date - 2022-02-11T01:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising