ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abu Dhabi Big Ticket: అదృష్టమంటే ఇతడిదే.. లాటరీ కొన్న రెండోసారికే ఊహించని విధంగా కోట్లు గెలుచుకున్నాడు!

ABN, First Publish Date - 2022-09-04T14:21:24+05:30

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం. కొందరికి ఊహించని విధంగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చిపడుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం. కొందరికి ఊహించని విధంగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చిపడుతుంటాయి. ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా లాటరీలో లక్కు కోసం పరితపిస్తూ ఉంటారు. అయితే ఊహించని విధంగా ఓ ఫ్రెంచి వ్యక్తికి రెండోసారే అబుదాబి బిక్ టికెట్ రాఫెల్‌ (Abu Dhabi Big Ticket raffle)లో భారీ జాక్ పాట్ కొట్టాడు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 20 మిలియన్ల దిర్హమ్స్ (మన కరెన్సీలో రూ.43.41కోట్లు) గెలుచుకున్నాడు. ఇలా అదృష్టం వరించడంతో ఫ్రెంచ్‌కు చెందిన సెలిన్ జాసిన్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లో ఉండే సెలిన్ జాసిన్ ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 13న అబుదాబి బిగ్‌టికెట్‌ రాఫెల్‌లో నం. 176528 గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 


ఇది అతడు కొనుగోలు చేసిన రెండో టికెటే కావడం గమనార్హం. శనివారం అబుదాబి ఎయిర్‌పోర్టులో నిర్వహించిన డ్రాలో సెలిన్ జాసిన్ కొన్న ఈ టికెట్‌కే జాక్‌పాట్ తగిలింది. దాంతో విజేతగా నిలిచిన అతడు రూ.43.41కోట్లు గెలుచుకున్నాడు. ముందుగా ఈ వార్తా తాను నమ్మలేదని, బిగ్‌ టికెట్ లాటరీ నిర్వాహకులు తనకు ఫోన్ చేసి చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై పోయానని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, బిగ్ టికెట్ రాఫెల్ గెలిచి తొలి ఫ్రెంచ్ వ్యక్తి సెలిన్ జాసినే. ఇక ఇదే డ్రాలో భారత్‌కు చెందిన జయకుమార్ వాసుపిళ్లై అనే వ్యక్తి 1లక్ష దిర్హమ్స్ (రూ.21.70లక్షలు) గెలుచుకున్నాడు. మరో భారత వ్యక్తి అజయ్ భాటియా కూడా కోటి రూపాయలు విలువ చేసే మసెరటి ఘిబ్లీ హైబ్రిడ్ జీటీ (Maserati Ghibli Hybrid GT) అనే కాస్ట్లీ కారు గెలుచుకున్నాడు.  

Updated Date - 2022-09-04T14:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising