ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE visa: విదేశీయులకు యూఏఈ పండగలాంటి వార్త.. ఇకపై ఆ దేశ వీసా చాలా ఈజీ

ABN, First Publish Date - 2022-09-17T16:33:26+05:30

విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పండగలాంటి వార్త చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పండగలాంటి వార్త చెప్పింది. ఎలాంటి స్పాన్సర్ అవసరం లేకుండా నేరుగా ఐదు రకాల ఎంట్రీ వీసాలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ (Authority for Identity), నేషనాలిటీ (Nationality), కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (Customs and Ports Security) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం విదేశీయులు అధికారిక వెబ్‌సైట్ లేదా UAEICP స్మార్ట్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. విదేశాలలో ఉన్న విదేశీయుడు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న వీసా వివరాలను తెలియజేసింది. 


వీటిలో గోల్డెన్ వీసా (Golden Visa) విధానాలను పూర్తి చేయడానికి అనేక ఎంట్రీలతో కూడిన 6-నెలల వీసా ఉంది. అలాగే అన్ని దేశాల పౌరులకు అనేక ఎంట్రీలతో కూడిన ఐదేళ్ల దీర్ఘకాలిక పర్యాటక వీసా (Tourist visa) కూడా ఉంది. దీంతో పాటు అమెరికా, బ్రిటన్, ఈయూ (EU) దేశాలలో నివసిస్తున్న భారతీయులు ఎవరైతే ఆయా దేశాల వీసాలను కలిగి ఉన్నారో వారికి ఓ ప్రత్యేక వీసాను ఇవ్వనుంది. అలాగే వీసా మినహాయింపు ఉన్న దేశాల జాతీయులకు మరో వీసా ఉంటుంది. దీంతో పాటు వర్చువల్ వర్క్ రెసిడెన్స్ వీసా సైతం ఈ జాబితాలో ఉంది.


ఈ వీసాల దరఖాస్తు సమయంలో విదేశీయులు వాటికి కావాల్సిన ధృవపత్రాలు సమర్పించడంతో పాటు తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఐసీఏ (ICA) వెల్లడించింది. ఇక అన్ని దేశాల వారికి ఇచ్చే ఐదేళ్ల దీర్ఘకాలిక పర్యాటక వీసా కోసం దరఖాస్తుదారు స్పాన్సర్ లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇది 90 రోజులకు మించకుండా నిరంతరంగా దేశంలో ఉండేందుకు వీలు కల్పిస్తుందని అథారిటీ తెలిపింది. కాగా, మొత్తం బస వ్యవధి సంవత్సరానికి 180 రోజులకు మించకుండా ఉంటే, దానిని అంతే కాలానికి పొడిగించుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. ఇక ఐసీఏ (ICA) ప్రకటించిన ఈ కొత్త వీసా విధానం 2022 అక్టోబర్ 3 నుండి అమలులోకి రానుంది.

Updated Date - 2022-09-17T16:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising