ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.2.95లక్షలు ఖర్చు చేసి మరీ ఓకే సినిమాను ఏకంగా 292సార్లు చూసేశాడు!

ABN, First Publish Date - 2022-04-18T23:53:13+05:30

సాధారణంగా ఎవరైనా తన అభిమాన నటుడు నటించిన సినిమాను ఎక్కువలో ఎక్కువ 20సార్లకు మించి చూడలేరేమో. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒకే సినిమాను ఏకంగా వందలసార్లు చూసి రికార్డు సృష్టించాడు. సినిమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: సాధారణంగా ఎవరైనా తన అభిమాన నటుడు నటించిన సినిమాను ఎక్కువలో ఎక్కువ 20సార్లకు మించి చూడలేరేమో. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒకే సినిమాను ఏకంగా వందలసార్లు చూసి రికార్డు సృష్టించాడు. సినిమా టికెట్లపైనే రూ.2.95లక్షలు ఖర్చు చేశాడు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? ‘సినిమా పిచ్చి అంతలా ఉన్న ఆ వ్యక్తి పేరేంటి.. ఇంతకూ అతడు ఏ సినిమాను చూశాడు’ అని అనుకుంటున్నారా.. అయితే మరెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దాం పదండి.



అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రామిరో అలనిస్ అనే వ్యక్తి ‘Spider-Man: No Way Home’ అనే సినిమాను డిసెంబర్ 16 నుంచి మార్చి 15 మధ్య ఏకంగా 292సార్లు చూసేశాడు. తన జీవితంలోని 720 గంటలు (సుమారు 30రోజులు) ఈ ఒక్క సినిమాకే కేటాయించాడు. సినిమా టికెట్లు కొనుగోలు చేయడం కోసం 3,400డాలర్లు (రూ.2.59లక్షలు) వెచ్చించాడు. అయితే 292సార్లు ఒకే సినిమాను చూసినందుకుగాను అతడికి గుర్తింపు లభించింది. ఒకే సినిమాను అనేక సార్లు చూసిన వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో అతడికి చోటు దక్కింది. Avengers: Endgame మూవీని 191సార్లు చూసి 2019లోనే తొలుత ప్రపంచ రికార్డు సాధించాడు. కానీ అర్నౌడ్ క్లెయిన్ అనే వ్యక్తి Kaamelott: First Instalment సినిమాను 204సార్లు చూసి 2021లో అలనిస్ రికార్డు బ్రేక్ చేశాడు. 




Updated Date - 2022-04-18T23:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising