ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Florida లో షాకింగ్ ఘటన.. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం.. లోపల నుంచి ఓ పిల్లాడి ఏడుపు పోలీసులకు వినిపించడంతో..

ABN, First Publish Date - 2022-05-24T02:32:43+05:30

అది గురువారం.. ఫ్లోరిడాలోని హిల్స్‌బరో కౌంటీ..! రాత్రి 10.45 గంటలకు స్థానిక పోలీసులకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. స్నెఫర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయనేది దాని సారాంశం. ఆ తరువాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అది గురువారం.. ఫ్లోరిడాలోని హిల్స్‌బరో కౌంటీ..! రాత్రి 10.45 గంటలకు స్థానిక పోలీసులకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. స్నెఫర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయనేది దాని సారాంశం. ఆ తరువాత.. అక్కడికి వెళ్లిన వారికి షాకింగ్ దృశ్యం కనపడింది. మంటల్లో తగలబడుతున్న  ఓ గదిలోంచి చిన్న పిల్లాడి ఏడుపు వినిపించింది. తలుపులు, కిటికీలు పగలగొట్టుకుని సిబ్బంది లోపలకు వెళ్లి చూడగా.. భయంతో వణికిపోతున్న ఓ బాలుడు వారికి కనిపించాడు. చుట్టూమంటలు వ్యాపిస్తుండటంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఆ చిన్నారి కూరుకుపోయాడు. బయటకు రావాలని పిలిచినా అతడు వచ్చేందుకు జంకాడు. 


ఈ క్రమంలో పోలీసులు ఎన్నో  ప్రయాసలకోర్చి అతడిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అతడి శరీరం తీవ్రంగా కాలిపోవడంతో బాలుడిని హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అతడి ఊపిరి తిత్తుల్లోకి కూడా పొగ వెళ్లిపోయినట్టు వైద్యులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మాత్రమే చేయగలిగిన ఈ ప్రయత్నాన్ని పోలీసులు ఎటువంటి జంకూ లేకుండా చేసి చూపించారు. ‘‘ఎటువంటి సంకోచాలు, భయాలు లేకుండా వారు పిల్లాడిని బయటకు తీసారు. రియల్ హిరోలు అంటే వీళ్లే’’ అంటూ స్థానిక పోలీసు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 



Updated Date - 2022-05-24T02:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising