ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కు పెట్టుకోనని మొండికేసిన మహిళ.. విమానాన్ని వెనక్కు మళ్లించిన పైలట్.. చివరకు..

ABN, First Publish Date - 2022-01-22T01:44:30+05:30

విమాన ప్రయాణికురాలు మాస్కు పెట్టుకునేందుకు నిరాకరించడంతో పైలట్ విమానాన్ని మార్గమధ్యంలోనే వెనక్కు మళ్లించాల్సి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మాస్కును వ్యతిరేకిస్తోన్న వారు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన తమ హక్కులకు భంగమనేది వారి వాదన. ఈ క్రమంలో మాస్కు వ్యతిరేకులకు, ప్రభుత్వాధికారులకు మధ్య వాగ్వాదాలు జరిగిన ఘటనలు కోకొల్లలు. తాజాగా.. ఓ విమాన ప్రయాణికురాలు మాస్కు పెట్టుకునేందుకు నిరాకరించడంతో పైలట్ విమానాన్ని మార్గమధ్యంలోనే వెనక్కు మళ్లించాల్సి వచ్చింది. అమెరికన్ ఎయిలైన్స్‌ విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. మొత్తం 129 మంది ప్రయాణికులతో ఆ విమానం మియామీ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరింది. అయితే..టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ విమాన ప్రయాణికురాలు సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. 


మాస్కు పెట్టుకోమని సిబ్బంది కోరగా.. ఆమె మాత్రం ఇందుకు ససేమిరా అంది. ఈ క్రమంలోనే పైలట్..ఇతర ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని వెనక్కు మళ్లించారు. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండవగానే..అక్కడి అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత.. ఈ ఫ్లైట్‌ను రద్దు చేసిన అధికారులు.. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించారు. కాగా.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విచారం వ్యక్తం చేసింది.  విమానంలోని సిబ్బంది తన బాధ్యతను చక్కగా నిర్వహించారని అభిప్రాయపడింది. అంతేకాకుండా.. ఈ ఘటనపై ప్రారంభమైన దర్యాప్తు పూర్తయ్యే వరకూ మాస్కును వ్యతిరేకంచిన మహిళ తమ సంస్థ విమానాల్లో ప్రయాణించకుండా అమెరికన్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం నిషేధం విధించింది.

Updated Date - 2022-01-22T01:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising