ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: టాప్ పోస్టుల నుంచి ప్రవాసులకు ఉద్వాసన.. వ్యూహం మార్చిన కువైత్!

ABN, First Publish Date - 2022-08-02T18:00:01+05:30

స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization policy) ద్వారా ఇప్పటికే కువైత్ సర్కార్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2017లో తీసుకువచ్చిన ఈ పాలసీ ద్వారా ఆ దేశం ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో భారీగానే ప్రవాసులకు ఉద్వాసన పలికింది. తాజాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization policy) ద్వారా ఇప్పటికే కువైత్ సర్కార్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2017లో తీసుకువచ్చిన ఈ పాలసీ ద్వారా ఆ దేశం ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో భారీగానే ప్రవాసులకు ఉద్వాసన పలికింది. ఈ ప్రాసెస్‌ను తాజాగా అక్కడి ప్రభుత్వం మరింత వేగంగా నిర్వహించే పనిలో పడింది. ప్రైవేట్ సెక్టార్‌లోని వివిధ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వలసదారులను తొలగించి వారి స్థానంలో కువైటీలను భర్తీ చేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా దేశంలోని పలు సూపర్ మార్కెట్స్ (Supermarkets), కోఆపరేటివ్స్‌ (Co-operatives)లోని సూపర్ వైజర్స్, మేనేజర్లు (Managers) పోస్టుల నుంచి ప్రవాసులకు ఉద్వాసన పలికింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అఫైర్స్‌ (Ministry of Social Affairs)కు కోఆపరేటివ్ సంస్థలు సమర్పించిన తాజా డేటా ప్రకారం సుమారు 480 మంది ప్రవాసులను ఇలా టాప్ పోస్టుల నుంచి తొలగించి కువైటీలతో భర్తీ చేసినట్లు తెలిసింది. అలాగే మరో 2,275 పోస్టులు కువైటీల కోసం సిద్ధంగా ఉన్నట్లు కోఆపరేటివ్స్ తెలియజేశాయని సివిల్ సర్వీస్ కమిషన్ (Civil Service Commission) వెల్లడించింది. 

Updated Date - 2022-08-02T18:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising