ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

60 ఏళ్లకు పైబడిన ప్రవాసులకు Work Permit.. ఒమన్ నిర్ణయం ఇదీ!

ABN, First Publish Date - 2022-01-28T13:37:08+05:30

60 ఏళ్లకు పైబడిన ప్రవాస కార్మికులకు వర్క్ పర్మిట్ల రెన్యువల్ విషయమై ఒమన్ కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: 60 ఏళ్లకు పైబడిన ప్రవాస కార్మికులకు వర్క్ పర్మిట్ల రెన్యువల్ విషయమై ఒమన్ కీలక నిర్ణయం తీసుకుంది. సుల్తానేట్‌లోని ఈ కేటగిరీ వలస కార్మికులు తమ వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఆ దేశ కార్మిక మంత్రిత్వశాఖ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ప్రైవేట్ సెక్టార్‌లోని ప్రవాస కార్మికులు వర్క్ పర్మిట్స్ రెన్యువల్ చేసుకుని ఉపాధి పొందవచ్చని మంత్రిత్వశాఖ వెల్లడించింది. కార్మిక శాఖ మంత్రి ఈ సర్క్యులర్‌ను మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండర్ సెక్రెటరీ షేక్ నసర్ అల్ హొసానీకి పంపించారు. "వయసు మినహాయింపుల కోసం పెద్ద సంఖ్యలో ప్రైవేట్ రంగానికి చెందిన ప్రవాస కార్మికుల నుంచి భారీ మొత్తంలో అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో వారి వర్క్ పర్మిట్లు పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పించండి. ప్రైవేట్ రంగం ప్రస్తుత స్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ప్రైవేట్ రంగంలోని 60 ఏళ్లు దాటిన ప్రవాస కార్మికులకు వర్క్ పర్మిట్ల రెన్యువల్‌కు అవసరమైన చర్యలు తీసుకోండి" అని సర్క్యులర్‌లో మంత్రి పేర్కొన్నారు. ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రవాస కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-01-28T13:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising