ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కేటగిరీ ఉద్యోగులను తొలగిస్తున్న Kuwait కంపెనీలు.. ఆందోళనలో ప్రవాసులు!

ABN, First Publish Date - 2022-01-21T15:51:42+05:30

60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల విషయమై గత కొంతకాలంగా కువైత్ నాన్చుడి ధోరణిని ప్రదర్శిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల విషయమై గత కొంతకాలంగా కువైత్ నాన్చుడి ధోరణిని ప్రదర్శిస్తోంది. ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల జారీ, రెన్యువల్ విషయమై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ దేశంలోని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది. అక్కడి స్థానిక మీడియా సమాచారం ప్రకారం 60 ఏళ్లు దాటిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులను కొన్ని సంస్థలు బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు తెలిసింది. వీరి విషయంలో సందిగ్ధం నెలకొనడంతో భవిష్యత్ దృష్ట్యా ఆయా కంపెనీలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాయట. ఈ ప్రవాసుల విషయంలో నిర్ణయం వెలువడేందుకు చాలా సమయంలో పట్టే అవకాశం ఉందని తెలియడంతో అక్కడి కంపెనీలు ఇలా బలవంతపు ఉద్వాసనలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక ఉద్యోగాలు కోల్పోతున్న ప్రవాసులకు వేరే కంపెనీల్లో కూడా అవకాశం దొరకడం లేదని సమాచారం. దీంతో చాలా ఏళ్లుగా కువైత్‌లో ఉంటున్న ప్రవాసులకు ఏటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.  


కాగా, 2020 ఆగస్టులో యూనివర్శిటీ డిగ్రీ లేని 60ఏళ్లకు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ల రెన్యూవల్‌ను నిలిపివేస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) డైరెక్టర్ జనరల్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఫత్వా, లెజిస్లేషన్ కమిటీ ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని వెల్లడించింది. ఈ కేటగిరీ ప్రవాసులకు వర్క్ పర్మిట్‌లను జారీ చేయడం నిషేధించడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని స్పష్టం చేసింది. 2020 ఆగస్టులో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జారీ చేసిన నిర్ణయం చట్టబద్ధంగా ఉనికిలో లేదని, అసలు పీఏఎం డైరెక్టర్‌కు ఈ నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదని వెల్లడించింది. వర్క్ పర్మిట్ల జారీకి సంబంధించి ప్రత్యేకమైన నియమాలు, విధానాలు ఉన్నాయని పేర్కొంది. 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయడం చట్టబద్ధంగా చెల్లదని, వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, ఏడాది కాలంగా అక్కడి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ఇక 2017లో తీసుకువచ్చిన కువైటైజేషన్‌ పాలసీలో భాగంగానే కువైత్ వలసదారుల విషయంలో ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో విదేశీయులను తగ్గించి దేశ పౌరులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకొచ్చిందే కువైటైజేషన్‌ పాలసీ.  

Updated Date - 2022-01-21T15:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising