ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hajj 2022: మక్కాలో ప్రవాసుల ఎంట్రీ బ్యాన్!

ABN, First Publish Date - 2022-05-28T15:11:05+05:30

Hajj 2022 నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మక్కాలో ప్రవాసుల ఎంట్రీపై ఆంక్షలు విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్కా: Hajj 2022 నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మక్కాలో ప్రవాసుల ఎంట్రీపై ఆంక్షలు విధించింది. అనుమతి లేని ప్రవాసులకు పవిత్ర నగరం మక్కాలో ప్రవేశించడాన్ని నిషేధించింది. ఈ నెల 26 (గురువారం) నుండి బ్యాన్ అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది హజ్ యాత్రను క్రమబద్ధీకరించే క్రమంలో జారీ చేసిన సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ప్రతినిధి జనరల్ షమీ అల్ షువైరెఖ్ వెల్లడించారు. మక్కా ప్రవేశానికి అనుమతి పొందిన ప్రవాసులు మాత్రమే మే 26కి సంబంధించిన షవ్వాల్ 25 గురువారం నుంచి మక్కాలోకి అనుమతించబడతారని తెలిపారు. 


ఇలా అనుమతులు ఉన్నవారు మక్కా ఎంట్రీ సెంటర్ల వద్ద ఉన్న భద్రతా నియంత్రణ కేంద్రాల నుంచి అనుమతి పొందవచ్చని తెలియజేశారు. అవసరమైన ధృవ పత్రాలు లేని నివాసితులు, వారికి సంబంధించిన వాహనాలను తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుందన్నారు. పవిత్ర ప్రదేశాలలో పని చేయాడానికి ఎంట్రీ పర్మిట్, మక్కా నుంచి జారీ చేయబడిన రెసిడెన్సీ పర్మిట్(ఇఖామా), ఉమ్రా పర్మిట్ ఉన్నవారికి మాత్రమే మక్కాలోకి అనుమతి ఉంటుందని షమీ అల్ షువైరెఖ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-28T15:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising