ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oman: ప్రవాసులకు తీపి కబురు.. ఉపాధి వీసా ఫీజులు భారీగా తగ్గింపు!

ABN, First Publish Date - 2022-06-03T19:48:14+05:30

ప్రవాసులకు ఒమన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉపాధి వీసా జారీ, పునరుద్ధరణ ఫీజులను భారీగా తగ్గించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: ప్రవాసులకు ఒమన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉపాధి వీసా జారీ, పునరుద్ధరణ ఫీజులను భారీగా తగ్గించింది. ఇక ఒమానిజేషన్ పాలసీకి కట్టుబడి ఉన్న కంపెనీలకు ఈ తగ్గింపు అనేది ఏకంగా 85 శాతం వరకు ఉంటుందని ఆ దేశ కార్మిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఫస్ట్‌క్లాస్ ప్రొఫెషన్‌కు చెందిన వర్క్ పర్మిట్ల ఫీజును 301 ఒమన్ రియాల్(రూ.60వేలు)గా నిర్ణయించింది. ఇంతకుముందు ఇది 2001 ఆర్ఓగా(రూ.4లక్షలు) ఉండేది. ఒకవేళ ఒమానిజేషన్ శాతానికి కట్టుబడి ఉంటే ఈ రుసుము కేవలం 211 ఆర్ఓ(రూ.42) చెల్లిస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 


ఇక ప్రత్యేక, సాంకేతిక స్థానాలకు వీసా ఫీజును 251 ఆర్ఓ(రూ.51వేలు)కు తగ్గించింది. ఇంతకుముందు ఇది 1001 ఆర్ఓగా(రూ.2లక్షలు) ఉండేది. కంపెనీల ద్వారా ఒమానిజేషన్ రేషియో కలిసినట్లయితే రేటు 30 శాతం తగ్గి ఆర్ఓ 176కి(రూ.35వేలు) చేరుతుంది. ఇకపోతే నైపుణ్యం లేని ఉద్యోగాలకు సంబంధించిన వీసా ఫీజు ఆర్ఓ 210కి(రూ.42వేలు) తగ్గించింది. ఇంతకుముందు ఇది ఆర్ఓ 301(రూ.60వేలు)గా ఉండింది. ఒకవేళ ఒమానిజేషన్ శాతాన్ని సంతృప్తిపరిస్తే కేవలం ఆర్ఓ 141(రూ.28వేలు) చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-06-03T19:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising