ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Floods in UAE: వరదలకు యూఏఈ అతలాకుతలం.. నిరాశ్రయులకు 300 హోటల్ రూమ్స్‌లో ఉచిత బస.. వ్యాపారవేత్త ఉదారత

ABN, First Publish Date - 2022-07-31T19:08:53+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)ను అకాల భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)ను అకాల భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. గత 27 ఏళ్లలో ఎప్పుడులేనంత భారీ వర్షాలు గురు, శుక్రవారాల్లో అక్కడ కురిశాయి. ప్రధానంగా పుజైరా (Fujairah), షార్జా (Sharjah), రాస్‌ అల్ ఖైమాల (Ras Al-Khaimah) జలమయం అయ్యాయి. ఈ నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. రంగంలోకి దిగిన సైన్యం వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారంతా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకా చాలమందికి సరిపడ ఆశ్రయాలు లేవు. దీంతో ప్రభుత్వానికి మద్దతుగా ఓ వ్యాపారవేత్త తనవంతు సాయంగా 300 హోటల్ రూమ్లలో ఉచిత బస కల్పించేందుకు ముందుకు వచ్చారు. 


వరదల తాకిడి కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలు ఈ హోటల్ రూమ్స్‌లో ఫ్రీగా ఉండొచ్చు. ఖలాఫ్ బిన్ అహ్మద్ అల్ హబ్టూర్ (Khalaf bin Ahmed Al Habtoor) అనే వ్యాపారవేత్త ఇలా విపత్కర పరిస్థితులలో పెద్ద మనసుచాటాడు. కమ్యూనిటీ అభివృద్ధి మంత్రిత్వశాఖ (Ministry of Community Development)తో కలిసి తనకు చెందిన అల్ హబ్టూర్ గ్రూపు (Al Habtoor Group) హోటల్స్‌లో ఈ ఉచిత సదుపాయం కల్పించారు. ఆరు వందల మందికిపైగా ఈ హోటల్ రూమ్స్‌లో ఉండే వెసులుబాటు ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే పుజైరా, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ కువైన్ ప్రాంతాల్లోని తనకు చెందిన హోటళ్లలో వరద ప్రభావిత బాధితుల కోసం మరికొన్ని రూమ్స్‌ను కేటాయించినట్లు ఈ సందర్భంగా ఖలాఫ్ బిన్ అహ్మద్ వెల్లడించారు.      


Updated Date - 2022-07-31T19:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising