ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలాస్ మస్క్‌పై మండిపడ్డ అమెరికా చట్టసభ సభ్యురాలు ..!

ABN, First Publish Date - 2022-01-02T02:29:01+05:30

తాను 11 బిలియన్ డాలర్ల ట్యాక్స్ చెల్లించినట్టు ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. దీనిపై భారతీయ సంతతి వ్యక్తి, అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ప్రమీలా జయపాల్ చాలా ఘాటుగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సంపన్నులపై ఎంత పన్ను వేయాలనేది ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్! ఈ విషయంలో టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన తన స్థాయికి తగినట్టుగా పన్ను చెల్లించట్లేదనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై స్పందించిన ఎలాన్ మస్క్.. తాను అమెరికా చరిత్రలో ఎవ్వరూ కట్టనంత ట్యాక్స్ కట్టబోతున్నానని ప్రకటించారు. ఆ తరువాత.. 11 బిలియన్ డాలర్ల ట్యాక్స్ చెల్లించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై భారతీయ సంతతి వ్యక్తి, అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ప్రమీలా జయపాల్ చాలా ఘాటుగా స్పందించారు. ఒక్క రోజులేనే 36 బిలియన్ డాలర్లను సంపాదిస్తున్న ఎలాన్ మస్క్... 11 బిలియన్ డాలర్ల ట్యాక్స్ చెల్లించానంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచీ ఆయన సంపద 270 బిలియన్ డాలర్ల మేర పెరిగింది అంటూ ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. 

Updated Date - 2022-01-02T02:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising