ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓల్డేజ్ హోంలోని వృద్ధురాలిని ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లిపోయిన ప్రియుడు.. కారణం ఏంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-02-21T02:21:30+05:30

ఓల్డేజ్ హోంలో ఉంటున్న వృద్ధురాలిని తనతో పాటూ తీసుకెళ్లిపోయిన వృద్ధుడికి ఏడు నెలల పాటు జైలు శిక్ష పడిన ఘటన ఆస్ట్రేలియాలో ఇటీవల చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓల్డేజ్ హోంలో ఉంటున్న వృద్ధురాలిని తనతో పాటూ తీసుకెళ్లిపోయిన వృద్ధుడికి ఏడు నెలల పాటు జైలు శిక్ష పడిన ఘటన ఆస్ట్రేలియాలో ఇటీవల చోటుచేసుకుంది. 84 ఏళ్ల కెరోల్ లిస్లీ, 80 ఏళ్ల రాల్ఫ్  గిబ్స్‌ మధ్య 15 ఏళ్లుగా ప్రేమ బంధం ఉంది. అయితే.. కొన్నాళ్లుగా కేరోల్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె కుటుంబసభ్యులు కేరోల్‌ను పెర్త్‌ నగరంలోని వృద్ధుల సంరక్షణా కేంద్రంలో చేర్చారు. ఫలితంగా రాల్ఫ్ ఆమెకు దూరమయ్యారు. అయితే.. ప్రియురాలికి ఎలాగైనా స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో రాల్ఫ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 


ఇటీవల ఓ రోజు రాల్ఫ్.. కెరోల్ ఉంటున్న కేంద్రానికి వచ్చి ఆమెను తన కారులో ఎక్కించుకుని ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లిపోయారు. 4,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెరోల్ సొంతింటికి ఆమెను చేర్చాలని, ఆమెతో కలిసుండాలనేది అతడి కోరిక. ఈ క్రమంలో ఆ వృద్ధ జంట చాలా దూరమే ప్రయాణించి చివరికి పోలీసులకు చిక్కింది. అయితే.. మతిమరుపు, పార్కిన్సన్స్ వ్యాధితో సతమతమవుతున్న కేరోల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయినట్టు పోలీసులు గుర్తించారు. చివరకు నిందితుడు.. రాల్ఫ్‌ను కూడా అరెస్ట్ చేశారు.  ఆమెను ప్రమాదంలోకి నెట్టాడనే అభియోగంపై కేసు నమోదు చేశారు. అయితే.. తాను కేరోల్‌పై ప్రేమతోనే ఇదంతా చేశానని  రాల్ఫ్ వేడుకున్నారు. అక్కడి మేజిస్ట్రేట్ రాల్ఫ్ వాదనతో కొంత మేర ఏకీభవించారు. అయితే.. వాస్తవిక దృష్టితో చూసినప్పుడు రాల్ఫ్ ప్రమాదకరమైన పని చేశాడని పేర్కొన్న మేజిస్ట్రేట్.. ఆయనకు ఏడు నెలల కారాగార శిక్ష విధించారు. అంతేకాకుండా.. ఆయన రెండేళ్ల పాటు కేరోల్ దరిదాపుల్లోకి కూడా రాకూడదంటూ రెస్ట్రెయినింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2022-02-21T02:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising