ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్టుబడి పెట్టండి.. US Visa పట్టండి

ABN, First Publish Date - 2022-06-02T13:13:20+05:30

ఇమిగ్రేషన్‌ నిబంధనలు కఠినం చేయడంతో అమెరికాలో పని చేయడానికి వీసాలు పొందడం కష్టంగా మారింది. అయితే.. అమెరికాలోని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వీసా పొంది అక్కడ ఉండొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఇమిగ్రేషన్‌ నిబంధనలు కఠినం చేయడంతో అమెరికాలో పని చేయడానికి వీసాలు పొందడం కష్టంగా మారింది. అయితే.. అమెరికాలోని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వీసా పొంది అక్కడ ఉండొచ్చు. ఇందుకు ఈబీ-5 ప్రోగ్రామ్‌ వీలు కల్పిస్తోందని ఇన్వెస్ట్‌ ఇన్‌ ద యూఎస్‌ఏ (ఐఐయూఎస్‌ఏ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆరన్‌ గ్రావౌ తెలిపారు. అమెరికాలో ఈబీ-5 వీసాల ప్రాసెస్‌ను చేపట్టే రీజినల్‌ కేంద్రాల అసోసియేషన్‌ ఇది. 


కనీసం 8 లక్షల డాలర్ల పెట్టుబడి.. ఈబీ-5 ప్రోగ్రామ్‌ కింద అమెరికా పౌరసత్వం పొందాలనుకునే అక్కడ ఉద్యోగావకాశాలు కల్పించే ఏ ప్రాజెక్టులోనైనా కనిష్ఠంగా 8 లక్షల డాలర్ల (దాదాపు రూ.6 కోట్ల్లు), గరిష్ఠంగా 10.5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రాజెక్టులు, ప్రాజెక్టు వల్ల లభించే ఉద్యోగాలు, ప్రాజెక్టు స్వభావం, ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలో నిరుద్యోగం తదితర అంశాల ఆధారంగా పెట్టుబడి ఉంటుంది. ఏ రంగంలోని ప్రాజెక్టులోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడి పెట్టిన వారితో పాటు భాగస్వామికి, 21 సంవత్సరాల లోపు పిల్లల్లో ఒకరికి.. మొత్తం 3 వీసాలు ఇస్తారు. గత ఏడాది వరకూ కనీస పెట్టుబడి 5 లక్షల డాలర్లుండేది. దీన్ని తాజాగా 8 లక్షల డాలర్లకు పెంచారు. ఈబీ-5 ప్రోగ్రామ్‌ కింద ప్రతి ఏడాది అమెరికా ప్రపంచ వ్యాప్తంగా 10 వేల వీసాలను జారీ చేస్తోందని ఆయన తెలిపారు. భారత్‌లో గరిష్ఠంగా  700 వీసాలను జారీ  చేయడానికి వెసులుబాటు ఉందన్నారు.  

Updated Date - 2022-06-02T13:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising