ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE-NEET: యూఏఈలో నీట్ పరీక్ష.. భారతీయ ఎంబసీ కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2022-07-16T02:06:22+05:30

యూఏఈలోని మూడు కేంద్రాల్లో నీట్(NEET) పరీక్ష జరగనున్నట్టు దుబాయ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం(Indian embassy) తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: యూఏఈలోని మూడు కేంద్రాల్లో నీట్- 2022(NEET) పరీక్ష జరగనున్నట్టు దుబాయ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం(Indian embassy) తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసిన పరీక్ష షెడ్యూల్‌ను పేర్కొంది. అబుధాబీలోని అబుధాబీ ఇండియన్ స్కూల్, దుబాయ్‌లోని ఇండియన్ హైస్కూల్, షార్జాలోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 17న ఈ పరీక్ష జరుగుతుంది. పేపర్ అండ్ పెన్ విధానంలో జరిగే ఈ పరీక్ష మధ్యాహ్నం 12.30కు ప్రారంభమై 3.50 గంటలకు ముగుస్తుంది. పరీక్ష రోజు ఉదయం 9.30 నుంచి 12.00 లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఎంబసీ పేర్కొంది. 12.00 తరువాత ఏ విద్యార్థినీ లోపలకు అనుమతించరు. ఇక పరీక్షకు సంబంధించిన ఇతర అప్‌డేట్ల కోసం http://neet.nta.nic.in వెబ్‌సైట్ చూడాలని విద్యార్థులకు ఎంబసీ సూచించింది. 

Updated Date - 2022-07-16T02:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising