ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అరుదైన ఘనత.. వరుసగా ఎనిమిదో సారి ఇలా..!

ABN, First Publish Date - 2022-02-23T15:28:42+05:30

దుబాయ్ ఇంటర్నేషనల్ (డీఎక్స్‌బీ) ఎయిర్‌పోర్ట్ అరుదైన ఘనత సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్

భారతే అగ్ర గమ్యస్థానం 

దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ (డీఎక్స్‌బీ) ఎయిర్‌పోర్ట్ అరుదైన ఘనత సాధించింది. వరుసగా ఎనిమిదో సారి ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది. 2021లో 29.1 మిలియన్ల మంది ప్రయాణికులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగించారు. ఇక అగ్ర గమ్యస్థాన దేశంగా భారత్ తన స్థానాన్ని నిలుపుకుంది. గతేడాది ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్‌కు 40.2 లక్షల మంది ప్రయాణించారు. ఇండియా తర్వాత పాకిస్థాన్(18లక్షలు), సౌదీ అరేబియా(15లక్షలు), యూకే(12లక్షలు), అమెరికా(11లక్షలు), ఈజిప్ట్(10లక్షలు), టర్కీ(9.45లక్షలు) ఉన్నాయి. ఇక నగరాల పరంగా చూస్తే 9.16లక్షల మంది ప్రయాణికులతో ఇస్తాంబుల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కైరో(9.05లక్షలు), లండన్(8.14లక్షలు), న్యూఢిల్లీ(7.91లక్షలు) ఉన్నాయి. ఇదిలాఉంటే.. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి 93 దేశాల్లోని సుమారు 198 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దాదాపు 84 అంతర్జాతీయ విమానయాన సంస్థలు విమానాలు నడిపిస్తున్నాయి. 2021లో మొత్తం 29,110,609 మంది ప్రయాణికులు డీఎక్స్‌బీ నుంచి రాకపోకలు కొనసాగించారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 40.5లక్షల మంది ప్రయాణించారు.  

Updated Date - 2022-02-23T15:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising