ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అనాథ యువతికి వివాహం జరిపించిన డా.ముక్కామల దంపతులు

ABN, First Publish Date - 2022-08-18T22:01:33+05:30

అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు, దాత డా.ముక్కామల అప్పారావు, డా.సుమతి దంపతులు ఔదార్యంతో ఒక అనాథ యువతికి అన్నీ తామై కల్యాణం జరిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు, దాత డా.ముక్కామల అప్పారావు, డా.సుమతి దంపతులు ఔదార్యంతో ఒక అనాథ యువతికి అన్నీ తామై కల్యాణం(Marriage) జరిపించారు. మంగళగిరి మండలం కాజా వద్ద ఉన్న చిన్మయ విజయ(Chinmaya Vijaya) ఆశ్రమంలో ఆరేళ్ళ వయసు నుంచి పెరిగిన విమలకు కర్నూలు(Kurnool) జిల్లా ఆదోనికి చెందిన రమేష్‌తో బుధవారం ఆశ్రమంలో ఘనంగా వివాహం జరిపించారు. విమల విద్యావంతురాలై విజయవాడలోని ఓ వైద్యశాలలో ఉద్యోగం చేస్తున్నారు. వరుడు రమేష్ కేరళలోని చిన్మయ యూనివర్సిటిలో ఐటీ సెక్టార్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.


వివాహానికి చిన్మయ మిషన్‌కు చెందిన ప్రధాన స్వామీజీలు హాజరై వివాహాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం నూతన దంపతుల చేత పాదుకా పూజ నిర్వహింపజేసారు. పలువురు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు ఈ వివాహానికి హాజరై డా. అప్పారావు, సుమతి దంపతులను అభినందించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ ముఖ్య కమిషనర్ పూనం మాలకొండయ్య, తానా మాజీ అధ్యక్షుడు డా.నరసరాజు, తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ,లింగమనేని సంస్థల అధినేత లింగమనేని భాస్కరరావు, ఎన్నారై విద్యా సంస్థల కార్యదర్శి డా. శ్రీధర్, డా.ముక్కామల పార్ధసారధి, డా.మన్నే భవచంద్ తదితరులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసారు. 





















Updated Date - 2022-08-18T22:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising