ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ నాకు స్నేహితుడు.. భారత్‌కు నాకంటే మంచి మిత్రుడు లేడు

ABN, First Publish Date - 2022-09-09T14:30:32+05:30

భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పొగడ్తల్లో ముంచెత్తారు. ఎన్‌డీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ ఓ గొప్ప వ్యక్తి. ఆయన అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాది మంచి స్నేహం. అలాగే భారత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 2024 ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం  
  • బైడన్‌ పాలనలో దేశ పరిస్థితి దిగజారింది
  • అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

న్యూయార్క్‌, సెప్టెంబరు 8: భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పొగడ్తల్లో ముంచెత్తారు. ఎన్‌డీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ ఓ గొప్ప వ్యక్తి. ఆయన అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాది మంచి స్నేహం. అలాగే భారత్‌కి నాకంటే మంచి మిత్రుడు మరొకరు లేరని అనుకుంటున్నా’ అని అన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌తో ఆయనకు మరింత మెరుగైన సంబంధాలు ఉన్నాయి కదా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘అది మీరు మోదీని అడగాలి’ అని సమాధానమిచ్చారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారని.. దానిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని ట్రంప్‌ స్పష్టం చేశారు. పోల్స్‌ అన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, 2024లోనూ బైడెన్‌ తన ప్రత్యర్థి అయితే సులువుగా విజయం సాధిస్తానని తెలిపారు. నిజానికి, 2020 ఎన్నికల్లో తానూ ఓడిపోలేదన్నారు. 2016తో పోలిస్తే 2020 ఎన్నికల్లో లక్షల సంఖ్యలో ఓట్లు అధికంగా తనకు వచ్చాయని తెలిపారు.  అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షునికి అన్ని ఓట్లు దక్కలేదని పేర్కొన్నారు.



ఒక వేళ తాను తిరిగి దేశాధ్యకుడినైతే విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే తన ప్రాధాన్యమని ట్రంప్‌ పేర్కొన్నారు. బైడెన్‌ రెండేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా గౌరవం కూడా మసకబారిందని అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశ వెనకబడిందని, విద్యుత్‌ కోసం ఇతరులను ప్రాధేయపడుతున్నామని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి అభ్యర్థి రేసులో తన కుమార్తె ఇవాంక ట్రంప్‌ లేదని స్పష్టతనిచ్చారు. ఇక, ఫ్లోరిడాలోని తన మార్‌- ఏ-లాగో రిసార్ట్‌లో జరిగిన ఎఫ్‌బీఐ దాడులు కేవలం రాజకీయ కుట్ర అని తెలిపారు. తన నివాసంలో దొరికాయని చెబుతున్న రహస్య పత్రాలను ఎఫ్‌బీఐ అధికారులే అక్కడ పెట్టారని ట్రంప్‌ ఆరోపించారు.


Updated Date - 2022-09-09T14:30:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising