ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కకు రూ.3300 ట్రాఫిక్ చలాన్..! ఇదేంటంటూ తికమక పడ్డ యజమాని.. చివరికి ఏం తేలిందంటే..

ABN, First Publish Date - 2022-04-11T00:47:59+05:30

ట్రాఫిక్ చలానా కట్టాల్సి రావడమంటే ఎవరికైనా ఇబ్బందే! అందుకే నిత్యం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అలర్ట్‌గా ఉండాలి. కానీ..జర్మనీకి చెందిన ఓ కారు యజమానికి ఊహించని షాక్ తగిలింది. కుక్కుపై ట్రాఫిక్ చలానా విధించినట్టు అక్కడి పోలీసులు కబురంపడంతో కారు యజమాని, అతడి కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకైపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ట్రాఫిక్ చలానా కట్టాల్సి రావడమంటే ఎవరికైనా ఇబ్బందే! అందుకే నిత్యం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అలర్ట్‌గా ఉండాలి. కానీ..జర్మనీకి చెందిన ఓ కారు యజమానికి ఊహించని షాక్ తగిలింది. కుక్కపై ట్రాఫిక్ చలానా విధించినట్టు అక్కడి పోలీసులు కబురంపడంతో కారు యజమాని, అతడి కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకైపోయారు. ట్రాఫిక్ పోలీసులు పంపించిన చలానా రసీదు చూసి వారికి నోటమాట రాలేదు. ఆ రసీదులోని ఫొటోలు కుక్క డ్రైవింగ్ చేస్తున్నట్టు ఉండటమే కారణం. చలానాపై కారు యజమానిపేరు ఉన్నప్పటికీ.. చిత్రలో మాత్రం కుక్క ఫొటో ఉంది. పోలీసులు 40 యూరోల జరిమానా విధించారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది సుమారు రూ. 3300. 


చలాన్‌లో ఉన్న ఫొటో చూసిన వారెవరికైనా కుక్క కారునడుపుతున్నట్టు అనిపించక మానదు. కారు యజమానికి కూడా అదే అనిపించింది. ఇంట్లో వారెవరికీ ఏమీ అర్థం కాలేదు. కుక్క ఎక్కడైనా కారు నడపగలదా.. అసలు ఇది సాధ్యమేనా.. మరి ఫొటో ఏంటి అలా ఉంది అనుకుంటూ మల్లగుల్లాలు పడ్డారు. అలా వారిలో వారు చర్చించుకున్న కొద్ది సేపటికీ జరిగిన విషయం గురించి క్లారిటీ వచ్చింది. వారు నాలుగు రోడ్లు కూడలి గుండా ప్రయాణిస్తున్న తరుణంలో తీసిన ఫొటో అది. అయితే..అక్కడ అమర్చిన సీసీ కెమెరా ఫొటో తీయడానికి కొన్ని సెకెన్ల ముందు వెనక సీట్లో ఉన్న కుక్క హఠాత్తుగా ముందుకు దూకి..డ్రైవర్‌ ఒళ్లో కూర్చుంటుంది. అలా కెమెరా కంటికి చిక్కింది. అయితే.. ట్రాఫిక్ పోలీసులు మాత్రం కుక్కకు సీట్ బెల్ట్ లేని కారణంగా ఈ జరిమాన విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే భలే యాధృచ్చిక ఘటన అంటూ ఆ కుటుంబం నవ్వుకుంది.  సాధారణం మేము కారులో వెళ్లే టప్పుడు కుక్కకు సీట్ బెల్ట్ పెడతాం. కానీ.. ఆ రోజు మాత్రం మా న్నాన్న, అంకుల్ ఈ విషయాన్ని మర్చి పోయారు’’ అంటూ ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి వివరించారు. 

Updated Date - 2022-04-11T00:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising